ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సందర్భంగా రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది (high court question to government on dharani problems). ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది పి.ఇంద్రప్రకాశ్ వ్యక్తిగత హోదాలో పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
అప్పటి వరకు పాత పద్ధతినే కొనసాగించేలా..
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సందర్భంగా ధరణి పోర్టల్‌లో పలు అవాంతరాలు ఏర్పడుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు(problems in dharani portal). భూముల రిజిస్ట్రేషన్‌ల కోసం రైతులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని... గతంలో రిజిస్ట్రేషన్‌లో ఉండే అన్ని సౌకర్యాలను ధరణి వెబ్ పోర్టల్‌లో చేర్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అంతేకాకుండా వెబ్ పోర్టల్‌లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే వరకు పాత పద్ధతిలో కూడా రిజిస్ట్రేషన్‌లు చేసేలా ఆదేశించాలని కోరారు.
ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి
ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుంటూ ధరణి వెబ్ పోర్టల్‌పై ఇప్పటికే పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాటితో జత చేయాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం తగిన సాంకేతిక మౌలిక సదుపాయాలను కల్పించకముందే ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిందని వ్యాఖ్యానించింది (high court question to government on dharani problems). ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సీసీఎల్‌ఏలకు నోటీసులు జారీ చేసింది. సమస్యలను తగ్గించడానికి ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 22 నాటికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: EC stop Dalithabandhu: ఈసీ కీలక నిర్ణయం.. హుజూరాబాద్ పరిధిలో దళితబంధు నిలిపివేత