Telangana HC on MLAs Poaching Case : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన 'ఎమ్మెల్యేలకు ఎర' కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు అప్పగించాలన్న భాజపా పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై విశ్వాసం లేదని.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. నిందితులకు భాజపాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ తమ నేతలపై దుష్ప్రచారం చేసేందుకు రాజకీయంగా ఈ కేసులు పెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు.
Telangana HC on MLAs Poaching Case Teuegu : గతంలో ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు దర్యాప్తు నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో ప్రస్తుతం ఆ కేసు దర్యాప్తు ఆగిపోయింది. అయితే భాజపా పిటిషన్ కొట్టివేయాలంటూ కేసు తీవ్రతను వివరిస్తూ గురువారం ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. సుమారు మూడు గంటల వీడియోలను కూడా హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో ఫోన్ టాపింగ్ జరిగిందని తనను ఇంప్లేడ్ చేయాలంటూ జర్నలిస్టు శివప్రసాద్ రెడ్డి కూడా ఓ పిటిషన్ దాఖలు చేశారు.
సీఎం పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతున్నందున పోలీసులపై నమ్మకం లేదని సీబీఐకి లేదా స్వతంత్ర విచారణకు ఆదేశించాలని.. అప్పటివరకు ఆడియోలు, వీడియోలు విడుదల చేయకుండా మద్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. అన్నింటినీ కలిపి నేడు హైకోర్టులో జస్టిస్ బి. విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మసనం విచారణ జరపనున్నారు.
ఇవీ చదవండి: