పోలీసులు తమను అక్రమంగా నిర్బంధించారనే కాంగ్రెస్ నేతల పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్పై అదనపు డీజీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ తరఫున కౌంటర్ దాఖలు చేశారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా జనసమీకరణకు పిలుపునిచ్చిందునే అరెస్టు చేసినట్లు అదనపు డీజీ పేర్కొన్నారు.
భారీ జనసమీకరణతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందునే నిర్బంధించినట్లు వివరించారు. కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేల హక్కులకు ఎలాంటి విఘాతం కలిగించలేదని స్పష్టం చేశారు. రాజీవ్ రతన్ పిటిషన్పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 26కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు: లక్ష్మణ్