ETV Bharat / state

అవినాష్‌ను కస్టడీకి తీసుకుంటామన్న సీబీఐ.... అరెస్ట్ చేయొద్దన్న తెలంగాణ హైకోర్టు

MP Avinash Reddy Case: వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డిని అవసరమైతే అదుపులోకి తీసుకుంటామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. అయితే సోమవారం వరకు అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అవినాష్‌రెడ్డి విచారణను వీడియో, ఆడియో రికార్డింగ్ చేస్తున్నట్లు హైకోర్టుకు సీబీఐ నివేదించింది. వివేకా హత్య స్థలిలో లభించిన లేఖ తమ వద్దే ఉందని.. తీవ్రమైన ఒత్తిడిలో రాసినట్లు ఉందని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఇచ్చిందని సీబీఐ పేర్కొంది. రికార్డింగులు, లేఖతో పాటు అవినాష్‌కు సంబంధించిన ఫైళ్లన్నీ సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. తన వాదన కూడా వినాలంటూ వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.

avinashreddy case
avinashreddy case
author img

By

Published : Mar 10, 2023, 7:42 PM IST

MP Avinash Reddy Case: తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని.. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపి.. దాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరుతూ అవినాష్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ.. వివేకా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. సీబీఐ దర్యాప్తు అధికారి పారదర్శకంగా వ్యవహరిచడం లేదన్నారు.

డ్రైవర్ ప్రసాద్ హత్య చేసినట్లు రాసి ఉన్న లేఖను సీబీఐ పరిగణనలోకి తీసుకోవడం లేదని అవినాష్ రెడ్డి వాదించారు. వివేకాకు ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని.. ఆ విషయంలో ఆయన కుమార్తె, అల్లుడితో విబేధాలపై కూడా సీబీఐ దృష్టి పెట్టడం లేదన్నారు. తాను చెబుతున్న విషయాలను సీబీఐ అధికారులు యథాతథంగా నమోదు చేయడం లేదని అవినాష్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరారు.

తీవ్రమైన చర్యలంటే ఏమిటన్న హైకోర్టు.. అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అడుగుతున్నారా అని ప్రశ్నించింది. సీఆర్‌పీసీ 160 కింద నోటీసు ఇచ్చినప్పటికీ.. అవినాష్ రెడ్డే నేరం అంగీకరించినట్లు తప్పుడు వాంగ్మూలం నమోదు చేసే అవకాశం ఉందని న్యాయవాది వాదించారు. అవినాష్‌రెడ్డి విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తున్నట్లు సీబీఐ పేర్కొనడంతో.. విచారణ కొద్దిసేపు వాయిదా వేసిన హైకోర్టు.. ఆ రికార్డింగులను సమర్పించాలని ఆదేశించింది.

మధ్యాహ్నం భోజన విరామం తర్వాత విచారణకు దర్యాప్తు అధికారి, సీబీఐ ఎస్పీ రామ్​సింగ్ వీడియో, ఆడియో రికార్డింగులను హైకోర్టుకు తీసుకొచ్చారు. రికార్డింగుల హార్డ్‌డిస్కు, కేసు ఫైళ్లన్నీ వెంటనే సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వివేకా హత్య స్థలిలో లభించిన లేఖ తమ వద్దే ఉందని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. లేఖ తీవ్ర ఒత్తిడిలో రాసినట్లు ఉందని సీఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఇచ్చిందని సీబీఐ పేర్కొంది. ఆడియో, వీడియో రికార్డింగుల హార్డ్‌డిస్క్‌, లేఖ, సీఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికతో పాటు అవినాష్‌కు సంబంధించిన ఫైళ్ల వివరాలన్నీ సోమవారం సమర్పించాలని.. దర్యాప్తు అధికారిపై ఆరోపణలున్నందున వాటిని తాము పరిశీలిస్తామని సీబీఐకి హైకోర్టు తెలిపింది.

సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది కోరారు. అవినాష్‌రెడ్డి నిందితుడా.. సాక్షా అని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. అవినాష్‌రెడ్డిని ఇప్పటి వరకు సాంకేతికంగా సాక్షిగా పరిగణిస్తున్నప్పటికీ.. ఆయన ప్రమేయంపై బలమైన అనుమానాలు ఉన్నాయని తెలిపింది. అవసరమైతే అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ పేర్కొంది.

సోమవారం వరకు అరెస్టు చేయవద్దని సీబీఐకి హైకోర్టు స్పష్టం చేసింది. మంగళవారం అవినాష్‌రెడ్డిని మళ్లీ పిలుస్తామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. విచారణ సందర్భంగా న్యాయవాదిని కూడా అనుమతించాలని అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది కోరగా.. హైకోర్టు అంగీకరించింది. అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో తన వాదన కూడా వినాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. పిటిషన్‌లో తన పేరు, కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఉన్నందున తన వాదన కూడా వినాలని కోరారు. సునీత ఇంప్లీడ్ కావడంపై తమకు అభ్యంతరం లేదని అవినాష్‌రెడ్డి, సీబీఐ న్యాయవాదులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.