ETV Bharat / state

TSPSC Group 4 Exam Halltickets : 'గ్రూప్​-4 పరీక్ష'.. హాల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకోండి - TSPSC Group 4 Exam Halltickets

Telangana Group 4 Exam Halltickets : తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ నిర్వహించే గ్రూప్​-4కి సంబంధించి హాల్​టికెట్లను కమిషన్​ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జులై 1వ తేదీన జరిగే ఈ పరీక్ష కోసం పటిష్ట ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. మొత్తం 9.51లక్షల మంది అభ్యర్థులు జులై 1న తమ భవితవ్యం తేల్చుకోనున్నారు.

TSPSC Group 4 Exam
TSPSC Group 4 Exam
author img

By

Published : Jun 24, 2023, 3:32 PM IST

Telangana Group 4 Notification latest news : తెలంగాణ గ్రూప్​-4 పరీక్ష సమీపిస్తుండటంతో తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 1వ తేదీన జరిగే ఈ పరీక్షకు సంబంధించి హాల్​టికెట్లను ఇవాళ కమిషన్ విడుదల చేసింది. జులై 1న ఉదయం 10నుంచి 12.30 గంటల వరకు మొదటి పేపర్​, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో పేపర్​ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మొత్తం 8వేల 180 పోస్టులకు గత ఏడాది గ్రూప్​-4 నోటిఫికేషన్​ జారీ చేయగా.. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 9.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

వేలి ముద్రలు తప్పనిసరి: గ్రూప్‌-4 ఉద్యోగుల భర్తీకి జూలై 1న పరీక్ష నిర్వహిస్తుండగా.. రాతపరీక్షలో అభ్యర్థుల వేలిముద్రల్ని టీఎస్‌పీఎస్సీ తప్పనిసరి చేసింది. పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షల్లో అభ్యర్థుల ఫింగర్​ ప్రింట్స్​ తీసుకున్న తరువాతే ఓఎంఆర్‌ పత్రాల్ని అందజేస్తారు. గత అనుభావాలను దృష్టిలో పెట్టుకొని గ్రూప్​- 4 రాతపరీక్ష నిర్వహణకు కమిషన్​ కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటుంది. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో అవసరమైన పరీక్ష కేంద్రాలను గుర్తించిన టీఎస్​పీఎస్సీ.. పరీక్షల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయం చేస్తోంది.

అభ్యర్థులు క్షుణంగా తనిఖీలు నిర్వహించిన తరువాతే పరీక్ష హాల్​లోకి అనుమతించనున్నారు. అభ్యర్థులు హాల్​టికెట్​తో పాటు తప్పనిసరిగా ఫొటో ఐడీ కార్డు తీసుకెళ్లాలని కమిషన్​ పేర్కొంది. గత సంవత్సరం నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షలో బయోమెట్రిక్‌ చేయగా.. ఆ సమయంలో 100 శాతం అభ్యర్థుల బయోమెట్రిక్‌ను తీసుకోలేకపోయారు. కొందరు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడం, పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి బయోమెట్రిక్‌ తీసుకోలేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఫొటో ఐడీ తప్పనిసరి: దీంతో తదుపరి పరీక్షల్లో అభ్యర్థుల్లో అపోహలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా కమిషన్​ చేసింది. అటెండెన్స్​ షీట్​లో ఫొటోను, అభ్యర్థి గుర్తింపు కార్డు, ముఖ్యాన్ని సరిచూసి సంతకం, వేలిముద్ర తీసుకుంటారు. ఈ పరీక్షకు అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని జిల్లా అధికారులకు టీఎస్​పీఎస్సీ సూచించింది.

ఓఎంఆర్‌ షీట్​లో అభ్యర్థులు హాల్‌టికెట్‌ నంబరు, ప్రశ్నపత్రం కోడ్‌, పేరు, సంతకం పేర్కొనాల్సి ఉంటుంది. అభ్యర్థులు మాస్​ కాపీయింగ్​ చర్యలు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని కమిషన్ హెచ్చరించింది. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రికల్​ పరికరాలు అనుమతి లేదని సూచించింది. అభ్యర్థులు సూచనలు పాటించి ఎటువంటి అపోహలు లేకుండా పరీక్షలు ధైర్యంగా రాయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.