ETV Bharat / state

ప్రశాంతంగా గ్రూప్​1 ప్రిలిమినరీ పరీక్ష.. 75 శాతం హాజరు నమోదు - హైదరాబాద్​ తాజా వార్తలు

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 75 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. సుమారు 94 వేల మంది పరీక్ష రాయలేదు. రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో 2 లక్షల 86 వేల 51 మంది ప్రిలిమ్స్ రాశారు. ప్రాథమిక కీ విడుదల చేసేందుకు 8 రోజుల సమయం పడుతుందని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. అభ్యర్థుల ఓఎంఆర్ సమాధాన పత్రాలన్నీ స్కాన్ చేసి.. వెబ్​సైట్​లో పెడతామని టీఎస్​పీఎస్సీ తెలిపింది.

ప్రశాంతంగా గ్రూప్​1 ప్రిలిమినరీ పరీక్ష.. 75 శాతం హాజరు నమోదు

author img

By

Published : Oct 16, 2022, 8:43 PM IST

తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. వివిధ విభాగాల్లో 503 గ్రూప్-1 పోస్టుల కోసం 3 లక్షల 80 వేల 81 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3 లక్షల 42 వేల 954 మంది మాత్రమే హాల్ టికెట్లు డౌన్​లోడ్ చేసుకున్నారు. ఇవాళ 1019 కేంద్రాల్లో జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 2 లక్షల 86 వేల 51 మంది హాజరయ్యారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష జరిగింది. ఉదయం 8:30 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష ప్రారంభానికి ముందే కేంద్రాల్లో అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలను సేకరించారు.

నియామక ప్రక్రియలో వివిధ సందర్భాల్లో బయోమెట్రిక్ వివరాల ఆధారంగా అభ్యర్థులను నిర్ధారిస్తారు. జిల్లా కో-ఆర్డినేటర్లు, సిట్టింగ్ స్క్వాడ్​లతో పాటు టీఎస్​పీఎస్సీ ప్రత్యేకంగా నియమించిన 61 మంది పరీక్షను పర్యవేక్షించారు. టీఎస్​పీఎస్సీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కార్యాలయం నుంచి కమిషన్ ఛైర్మన్, సభ్యులు పర్యవేక్షించారు.

అభ్యర్థుల ఓఎంఆర్ సమాధాన పత్రాలను స్కాన్ చేసి.. వెబ్​సైట్​లో పెట్టనున్నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించిది. సుమారు 8 రోజుల్లో ఓఎంఆర్ సమాధాన పత్రాలు స్కాన్ చేసి.. ఆ తర్వాత ప్రాథమిక సమాధానాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందన్న టీఎస్​పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి.. సహకరించిన వివిధ విభాగాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా జోన్, రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. మెయిన్స్ డిసెంబరులో నిర్వహించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి..

ప్రశాంతంగా గ్రూప్‌1 పరీక్ష.. తరలివచ్చిన అభ్యర్థులు

రాష్ట్రపతి ముర్ముకు కంటి ఆపరేషన్​.. ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.