Telangana Govt Released Funds To Gram Panchayats : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు శుభవార్త. పంచాయతీలకు రూ.1190 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ ఉదయం మరోమారు సమావేశమై బకాయిల విషయమై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో వివిధ పనులకు సంబంధించి నిలిచిపోయిన బకాయిలు రూ.1190 కోట్లను విడుదల చేయాలని నిర్ణయించారు.
సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు : ఈ మేరకు వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిధుల విడుదలతో సర్పంచులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన సర్పంచుల సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అన్న మంత్రి ఎర్రబెల్లి.. మాట తప్పకుండా, అందరి శ్రేయోభిలాషిగా ఆలోచిస్తున్నారని చెప్పారు. పల్లెల్లో ప్రగతిని దృష్టిలో ఉంచుకొని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నిధులు విడుదల చేస్తూ అభివృద్ధిని నిరాటంకంగా కొనసాగిస్తున్నారని అన్నారు. నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
గతేడాది డిజిటల్ కీ ద్వారా.. కేంద్ర నిధులు తీసుకున్న ప్రభుత్వం : గ్రామ పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంపై సర్పంచ్లు ధర్నాలు చేశారు. అప్పులు చేసి మరీ గ్రామాల్లో అభివృద్ధి చేస్తే.. ఆ నిధుల నగదును తమకు ఇవ్వడం లేదని గ్రామ సర్పంచ్లు గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్ర 15వ ఆర్థిక సంఘం వేసిన నిధులను కూడా ప్రభుత్వం తమ అవసరాలకు వాడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Gram Panchayat Funds Released : ఆసిఫాబాద్లో అయితే ఏకంగా 18 మంది సర్పంచ్లు రాజీనామా చేశారు. కేంద్ర నుంచి వచ్చే నిధుల కోసం ప్రత్యేకంగా సర్పంచులు, ఉప సర్పంచులు కోసమే తెరచిన ఖాతాలకు డిజిటల్ కీలను ఇచ్చారు. ఆ కీలను కూడా గ్రామ సర్పంచులకు తెలియకుండా.. నిధులను తీసి రాష్ట్ర ప్రభుత్వం అవసరాలకు వాడుకున్నారు. దీనిపై కొందరు సర్పంచ్లు అయితే పోలీస్ స్టేషన్లలో సైతం ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.1190 కోట్ల నిధులు విడుదల చేయడంపై గ్రామ సర్పంచ్లు ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి :