ETV Bharat / state

మేడిగడ్డ బ్యారేజీ ఘటన జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలు, ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం - మేడిగడ్డ బ్యారేజీ కుంగిబాటు

Telangana Govt Details Medigadda Barrage to National Dam Safety Authority : మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలు, ఆరోపణలపై వివరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశాలపై నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీలు, ఇంజినీర్లతో సమావేశమైన ఆయన నివేదికలోని అంశాలపై చర్చించారు.

Medigadda Barrage
Medigadda Barrage
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 6:22 PM IST

Telangana Govt Details Medigadda Barrage to National Dam Safety Authority : మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(National Dam Safity Authority) లేవనెత్తిన అంశాలు, ఆరోపణలపై తగిన వివరాలతో సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కుంగిన ఆనకట్టను పరిశీలించిన అనంతరం జాతీయ అథారిటీ ఇచ్చిన నివేదికపై నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీలు, ఇంజినీర్లతో సమావేశమైన ఆయన నివేదికలోని అంశాలపై చర్చించారు.

ఈఎన్సీలు మురళీధర్, అనిల్ కుమార్, నాగేందర్ రావు, హరిరాం, వెంకటేశ్వర్లు, సీఈలు, టెక్నికల్ కన్సల్టెంట్ రామరాజు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే సమీక్షలో పాల్గొన్నరు. ఎన్ఎస్డీఏ నివేదికలో లేవనెత్తిన అంశాలపై వివరంగా చర్చించారు. నివేదికలో పేర్కొన్న అంశాలు, ఆరోపణలకు తగిన వివరాలతో సమాధానాలు ఇవ్వాలని నిర్ణయించారు. సంబంధించిన సమాచారం, వివరాలను కూడా పూర్తిగా అందిస్తూ లేఖ రాయనున్నారు.

Medigadda Barrage in Bhupalpally : "మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు.. కానీ?"

Medigadda Barrage Issue in Bhupalpally : కాళేశ్వరం ఎత్తిపోతల్లో(Kaleshwaram Project) భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీను నిర్మించారు. ఈ బ్యారేజీని మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. అయితే తెలంగాణ-మహారాష్ట్రను కలిపే ఈ బ్యారేజీ వంతెన అక్టోబరు 22న భారీ శబ్ధంతో 20వ పిల్లర్‌ కుంగిపోయింది. దీంతో 7వ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఇంజినీర్లు బ్యారేజీలోని 10 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. దీనిపై వెంటనే బ్యారేజీ నిర్వాహకులకు సమాచారం అందించారు.

ఈ విషయంలో కేంద్ర జల్‌ శక్తి శాఖ.. ఆరుగురితో కూడిన నిపుణుల బృందాన్ని వెంటనే తెలంగాణ పంపించింది. బ్యారేజీ దగ్గర పగుళ్లు ఏర్పడిన పిల్లర్లను పరిశీలించిన కేంద్ర బృందం.. రాష్ట్ర అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించింది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి 20 అంశాలను జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కోరింది. అందులో 18 అంశాలను రాష్ట్ర డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది. ఇంకా మరో రెండు అంశాలపై జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీకి వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే వీటన్నింటినీ పరిశీలించిన జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నిర్మాణంలో లోపం ఉందని చెప్పింది. పిల్లర్ల కింద ఉండే ఇసుక కోతకు గురైందని తెలిపింది.

Annaram Barrage ​Laekage Issue : మరోవైపు శుక్రవారం అన్నారం బ్యారేజీAnnaram Barrage)లోని రెండు చోట్ల ఏర్పడిన సీపేజీని కేంద్ర జల సంఘం డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని తెలంగాణ డ్యాం సేఫ్టీ అధికారులను సీడబ్ల్యూసీ అధికారులు కోరారు. బ్యారేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర బృందానికి తెలిపారు. అలాగే గతంలో కూడా ఇలానే సీపేజీ ఏర్పడితే కెమికల్ కాంక్రీటు గ్రౌటింగ్‌ చేసి అరికట్టామని తెలంగాణ ఇంజినీర్లు వివరించారు.

Medigadda Barrage Issue Update : మేడిగడ్డ బ్యారేజీ 15 అంశాల నివేదికను కేంద్రానికి పంపిన రాష్ట్ర ప్రభుత్వం

Medigadda Barrage Issue : మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు.. రాష్ట్రానికి కేంద్రం అల్టిమేటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.