ఆంధ్రప్రదేశ్ విశాఖలో వైభవంగా సాగుతున్న శ్రీ శారదా పీఠ వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహిచిన విశ్వశాంతి హోమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. గవర్నర్ పీఠం ప్రతినిధులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాజ శ్యామల దేవికి తమిళిసై ప్రత్యేక పూజలు చేశారు.
ఈ వార్షికోత్సవాలకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు, మంత్రి శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఏపీ సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు హారయ్యారు. ప్రముఖుల రాకతో అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: నా వల్లే చనిపోయాడు.. నేనూ ఉండలేను!