Midhani: విదేశీ ఉత్పత్తుల సరఫరాపై ఆధారపడకుండానే అంతరిక్షం, రక్షణ, ఇంధన రంగాలకు కీలకమైన పదార్థాల లభ్యతను నిర్ధారించడంలో మిధాని కీలక పాత్రను గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించారు. కంచన్‌బాగ్ మిధానిలో వారం రోజులపాటు కొనసాగిన మిధాని ఉత్పత్తుల ప్రదర్శన ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మిధాని ఉత్పత్తులు, పనిచేసే విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించారు. అంతరిక్షం, రక్షణ, ఇంధన రంగాలకు లోహాలు, మిశ్రమాలు తయారు చేయడంలో మిధాని కృషిని ప్రశంసించారు. ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతో దూసుకుపోతోందని కొనియాడారు. మిధాని ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా విభిన్న ప్రయత్నాలతో పాటు స్వదేశీకరణ ప్రయత్నాలనూ అభినందించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా నిరుపేదలకు బయో-మెడికల్ ఇంప్లాంట్‌లు సరఫరా చేసిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. హైదరాబాద్, హరియాణాలోని రోహ్‌తక్‌లలో వారం రోజులపాటు ప్రదర్శన నిర్వహించినట్లు మిధాని సీఎండీ డాక్టర్ సంజయ్‌కుమార్ ఝా తెలిపారు. మిధాని డైరెక్టర్(ఫైనాన్స్) ఎన్. గౌరీశంకర్‌రావు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
ఇదీ చూడండి: ఫుడ్ సరిగా వండలేదని వదినను కాల్చి చంపిన మరిది