ETV Bharat / state

చివరి త్రైమాసికంలో రూ.6 వేల కోట్లకుపైగా రుణం తీసుకోనున్న సర్కార్

author img

By

Published : Jan 1, 2023, 10:52 AM IST

చివరి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6 వేల కోట్లకు పైగా రుణం తీసుకోనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.28 వేల కోట్లు అప్పుగా తీసుకొంది.

Telangana Government
Telangana Government

'త్రైమాసికంలో 6వేల కోట్లకుపైగా రుణం తీసుకోనున్న ప్రభుత్వం'

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.28 వేల కోట్లు రుణాల ద్వారా సమీకరించుకొంది. 2022-23లో వాస్తవానికి రూ.55 వేల కోట్లను ఎఫ్​ఆర్​బీఎమ్​కు లోబడి అప్పుగా తీసుకోవాలని సర్కార్ భావించింది. ఈ మేరకు బడ్జెట్​లో ప్రతిపాదించింది. అయితే బడ్జెటేతర అప్పుల విషయమై అభ్యంతరం తెలిపిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అప్పు మొత్తానికి అనుమతి ఇవ్వలేదు.

గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో తీసుకున్న బడ్జెటేతర రుణాల మొత్తాన్ని నాలుగు ఆర్థిక సంవత్సరాలకు సర్దుబాటు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎఫ్​ఆర్​బీఎమ్​ అప్పుల్లో కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా రూ.14 వేల కోట్ల మేర కుదించింది. దీంతో మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా సమీకరించుకుంటోంది. డిసెంబర్ నెలాఖరు వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలు ముగిశాయి.

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్​ఆర్​బీఎమ్​​కు లోబడి రూ.28 వేల కోట్లను అప్పుగా తీసుకొంది. చివరి త్రైమాసికంలో తీసుకునే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు రూ.6,572 కోట్లను రుణంగా సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. జనవరి 10న రూ.1,000 కోట్లు, 17న రూ.500 కోట్లు, 31న రూ.1,000 కోట్లను అప్పుగా తీసుకోనున్నట్లు పేర్కొంది.

ఫిబ్రవరి 7న రూ.1,000 కోట్లు.. 14, 28 తేదీల్లో రూ.500 కోట్ల చొప్పున రుణాన్ని ప్రతిపాదించారు. మార్చి 6న రూ.1,000 కోట్లు, 14న రూ.500 కోట్లు, 28న రూ.572 కోట్లను రుణంగా సమీకరించుకోనున్నట్లు ఆర్బీఐకి తెలిపింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక శాఖ రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లను జారీ చేస్తుంది. ఆర్బీఐ వాటిని వేలం వేస్తుంది. వేలం పూర్తైన తర్వాత బాండ్ల మొత్తం రాష్ట్ర ఖజానాకు సమకూరుతుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.