ETV Bharat / state

తేనెటీగల పెంపకంపై ప్రత్యేక దృష్టి.. రైతులకు లాభాలెన్నో..! - తెలంగాణ వార్తలు

పర్యావరణహితంగా పంటల సాగులో అధిక దిగుబడులు, జీవవైవిధ్యం పరిరక్షించడంలో దోహదపడే తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సాహించేందుకు సర్కారు సిద్ధమైంది. ఆత్మనిర్భర్ అభియాన్‌లో భాగంగా రాయితీలు ఇస్తున్నప్పటికీ... సరైన అవగాహన లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో పైసా కూడా రైతులకు అందడం లేదు. ఇది గుర్తించిన ప్రభుత్వం... ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జరిగిన మొదటి రాష్ట్ర స్థాయి సన్నాహక కమిటీ సమావేశంలో రైతులు, స్వచ్ఛంద సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల అభిప్రాయాలు స్వీకరించింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడం ద్వారా సేంద్రీయ, ప్రకృతి విధానంలో సాగయ్యే పంటలకు అనుబంధంగా తేనెటీగల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం తెచ్చిపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

beekeeping benifits,sweet revolution in telangana
తేనెటీగల పెంపకంపై ప్రత్యేక దృష్టి, స్వీట్ రెవల్యూషన్
author img

By

Published : Aug 2, 2021, 6:47 PM IST

రాష్ట్రంలో తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పట్టణ, నగర, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం, విదేశీ ఎగుమతులకు మంచి డిమాండ్ ఉండటంతో చిన్న, సన్నకారు రైతులు, నిరుద్యోగ యువతను టీనెటీగల పెంపకం వైపు మళ్లించేందుకు సన్నాహాలు చేస్తున్న ఉద్యాన శాఖ... ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధ్యయనం ప్రారంభించింది. 'స్వీట్ రెవల్యూషన్'లో భాగంగా హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సన్నాహక కమిటీ సమావేశం జరిగింది.

అదనపు ఆదాయం

ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోయినా ఇప్పటికే ఆసక్తితో తేనెటీగలు పెంచుతూ తేనె, తేనె ఉత్పత్తులు చేసి సొంత బ్రాండ్లు సృష్టించి మార్కెటింగ్ చేస్తున్న వారి నుంచి అనుభవాలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. పర్యావరణహితం, జీవవివైవిధ్య పరిరక్షణ దృష్ట్యా ఉద్యాన పంటలకు అనుబంధంగా తేనెటీగలు పెంచినట్లైతే... మిత్ర పురుగులు పెరిగి అధిక దిగుబడులు రావడమే కాకుండా తేనె ద్వారా కూడా అదనపు ఆదాయం చేకూరుతుంది. తేనెటీగల పెంపకం, ఉత్పత్తుల వల్ల ప్రయోజనాలు, ఆదాయపరంగా రైతులకు ఆర్థిక భరోసా వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ ఓ నివేదిక ప్రభుత్వానికి అందజేసి... రైతులకు ఆధునిక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

విప్లవానికి శ్రీకారం

ప్రధాన ఆహార పంట వరి, పత్తి లాంటి ఏక పంట విధానం... ఆయా పంటల సాగులో విచక్షణారహితంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకం వల్ల పర్యావరణ సమతుల్యత, జీవవైవిధ్యం దెబ్బతింటున్న నేపథ్యంలో కేంద్రం ఈ విప్లవానికి శ్రీకారం చుట్టింది. పొద్దుతిరుగుడు, నువ్వులు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పూల తోటల్లో పరపరాగ సంపర్కం కొరవడి మిత్ర పురుగులు చనిపోతున్నాయని శాస్త్రీయంగా రుజువైన దృష్ట్యా తేనెటీగల పెంపకం చేపట్టేందుకు రైతులను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుని తేనెటీగల పెంపకం ఒకటిగా భావించి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది.

కొవిడ్-19 నేపథ్యంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే క్రమంలో ఆత్మ నిర్భర్ అభియాన్‌ కింద తేనెటీగల పెంపకం కోసం రూ.500 కోట్లను కేటాయించింది. మధుక్రాంతి పథకం నిధులు వెచ్చిస్తున్నా కూడా సరైన అవగాహన లేకపోవడంతో రాష్ట్రంలో రైతులు సద్వినియోగం చేసుకోవడం లేదని ప్రభుత్వం గుర్తించింది. రాజేంద్రనగర్‌లో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలోని ఆర్టీపీలో యువత, మహిళలు, రైతులకు శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్న వేళ... తాజా ఉద్యాన శాఖ కూడా ముందుకు రావడం శుభపరిణామం. తేనెటీగల పెంపకం మరింత ముందుకు వెళ్లడానికి ఇది దోహదం చేస్తుంది.

- ఖాన్‌, జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ డైరెక్టర్

సర్కార్ భరోసా అవసరం

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నేషనల్ బీకీపింగ్ అండ్ హనీ మిషన్‌ - ఎన్‌బీహెచ్‌ఎం ఆధ్వర్యంలో మధు క్రాంతి పథకం ద్వారా తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో సరైన ఉత్పత్తి లేకపోవడం వల్ల తేనె కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఉత్తరప్రదేశ్‌, బిహార్, పంజాబ్ రాష్ట్రాలు తేనెటీగల పెంపకం, ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాయి. దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని ఉద్యానశాఖ ముందుకొచ్చింది. చిన్న, సన్నకారు రైతులకు‌ జీవనోపాధిగా తేనెటీగల పెంపకం ఓ వరం. నాణ్యత హామీ, కనీస మద్దతు ధర, తేనెటీగల కాలనీలు, రవాణా, శుద్ధి, ప్యాకేజింగ్, బ్రాండింగ్, పరీక్ష, సేంద్రీయ ధ్రువీక‌ర‌ణ, ఉత్పత్తుల మార్కెటింగ్‌పై సర్కారు భరోసా ఇస్తే... రైతులు, యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దీనిపై దృష్టి సారిస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి, రైతులు, ఔత్సాహిక తేనెటీగల పెంపకందారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ప్రాజెక్ట్ దియా.. పేదలకు ఉచితంగా సైకిళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.