జిల్లా, మండల ప్రజాపరిషత్‌లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.250 కోట్ల రూపాయలను పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల బలోపేతం కోసం చర్యల్లో భాగంగా జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్‌లకు నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పల్లెప్రగతి నిధుల నుంచి కేటాయింపులు చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా రూ.250 కోట్ల రూపాయలు విడుదల చేశారు. జిల్లా పరిషత్‌లకు రూ.125.87 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.124.12 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నిధుల విడుదలకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులను జిల్లా, మండల పరిషత్‌ల అభివృద్ధి, వాటి పరిధిలోని ప్రజల పురోగతికి సక్రమంగా వినియోగించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:
CM KCR review : ధాన్యం విషయంలో కేంద్ర వైఖరిపై సీఎం అసంతృప్తి...