Srinivas Yadav review on Golkonda bonalu arrangements : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు ఆదేశించారు. గోల్కొండ కోట వద్ద ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. గోల్కొండ బోనాల ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారని మంత్రి గుర్తు చేశారు.
బోనాల ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అంతే కాకుండా బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో వివిధ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు.
Telangana Bonalu 2023 : బస్తీలలోని దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలకు ముందే ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు ఎలాంటి తోపులాటను నియత్రించేందుకు పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
భక్తులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన పోలీసు సిబ్బందిని వివిధ జిల్లాల నుంచి తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా తాత్కాలికంగా అవసరమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు మంత్రి ప్రకటించారు.
"తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత రాష్ట్రంలో పండగలు, ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. గోల్కొండ బోనాలకు ప్రతి సంవత్సవం రూ.10లక్షలు ఇస్తున్నాం. బస్తీలలోని దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. వివిధ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రభుత్వం తరుపున రూ.15 కోట్లు విడుదల చేస్తున్నాం. పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేశాం. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా అదనపు ట్రాన్స్ ఫార్మర్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచుతున్నాం. భక్తులకు తాగునీరు అందుబాటులో ఉంటుంది. బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం".- తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్థక శాఖ మంత్రి
ఇవీ చదవండి: