Postings for 2020 Batch IAS Officers: 2020 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు 14 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలకు పోస్టింగుల ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా 2020 బ్యాచ్‌కు చెందిన ఏడుగురిని, 2019 బ్యాచ్‌కు చెందిన ఒకరిని నియమించింది. జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌గా అపూర్వ్ చౌహాన్, వరంగల్ అదనపు కలెక్టర్‌గా అశ్వినిని నియమించారు.
మంచిర్యాల అదనపు కలెక్టర్‌గా బి.రాహుల్, నారాయణపేట అదనపు కలెక్టర్‌గా మయాంక్మిత్తల్కు పోస్టింగు ఇచ్చారు. జగిత్యాలకు మందా మకరందు, జనగామకు ప్రఫుల్దేశాయిని అదనపు కలెక్టర్లుగా నియమించారు. మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా అభిషేక్ అగత్స్య, నల్గొండ అదనపు కలెక్టర్‌గా కుష్బు గుప్తాకు పోస్టింగ్ ఇచ్చారు. నల్గొండ అదనపు కలెక్టర్‌గా ఉన్న రాహుల్ శర్మను వికారాబాద్‌కు బదిలీ చేశారు. ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో అదనపు కలెక్టర్లుగా ఉన్న హరిసింగ్, చంద్రారెడ్డి, అరుణ శ్రీ, అబ్దుల్ హమీద్, జాన్ శాంసన్లను తదుపరి పోస్టింగుల కోసం సంబంధిత శాఖల్లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇవీ చూడండి..
'ఎమ్మెల్యేలకు ఎర కేసు'లో.. భాజపాకు పిటిషన్ వేసే అర్హత ఉందా..? లేదా...?
పార్టీపై విశ్వాసంతో గెలిపించారు.. నల్గొండలో ప్రగతి పరుగులు తీయాలి: సీఎం కేసీఆర్