ETV Bharat / state

హరితహారం ఆరంభ శూరత్వమేనా! నాటాక శ్రద్ధపెట్టే వారేరి? - telangana government

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారానికి అధికారుల నిర్లక్ష్యం తూట్లు పొడుస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ పథకాన్ని సమీక్షిస్తున్నా క్షేత్రస్థాయిలో సిబ్బంది అలసత్వం వీడటంలేదు. ఫలితంగా నాటిన మొక్కల్లో మూడింట రెండొంతులుపైగా ఎండిపోయాయి. హరితహారం అమలుతీరుపై రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్‌ గ్రామీణ, పట్టణ, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో క్షేత్రస్థాయి పరిస్థితుల్ని ‘ఈటీవీ భారత్​’ ప్రత్యేకప్రతినిధి అధ్యయనం చేశారు.. అనేక కీలక అంశాలు వెలుగుచూశాయి. అవేంటో చూద్దాం.

telangana government officials Neglected haritha haram
హరితహారం ఆరంభ శూరత్వమేనా! నాటాక శ్రద్ధపెట్టే వారేరీ?
author img

By

Published : Jan 2, 2020, 9:30 AM IST

రాష్ట్రంలో హరితహారం అమలలో అధికారుల అలసత్వం కనిపిస్తోంది. మొక్కలకు క్రమం తప్పకుండా నీళ్లు పెట్టకపోవడం.. పశువులు, మేకల నుంచి రక్షణ చర్యల్లేకపోవడంతో చాలావరకు చనిపోతున్నాయి. ఉన్న మొక్కలు సంరక్షించడం మరిచిన అధికారులు కొత్త మొక్కలు నాటడంలో మాత్రం ఉత్సాహం కనబరుస్తుండటం గమనార్హం. మొక్కలను రక్షించలేకపోతున్న సిబ్బందే మళ్లీ మళ్లీ వాటిని నాటుతూనే ఉన్నారు.. ఫలితంగా పచ్చదనం మాత్రం ఆశించినంతగా కనిపించడంలేదు.

హరితహారం చేపట్టి ఐదేళ్లు పూర్తయ్యింది. 230 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం. 2015-16 నుంచి ఏటా జరుగుతున్న ఈ కార్యక్రమంలో 2019-20 నాటికి అడవి బయట, లోపల కలిపి 177 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారిక లెక్కలు. ప్రభుత్వం రూ.3,836 కోట్లు ఖర్చు చేసింది. ఎన్ని బతికాయన్నదానిపై మాత్రం లెక్కల్లేవు. క్షేత్రస్థాయిలో మొక్కల లెక్కల్లో చాలా అంతరం కనిపిస్తోంది. కొన్నిచోట్లయితే కాగితాల్లోనే మొక్కలు. ప్రజలు స్పందించిన చోట, స్థానిక సంస్థలు ప్రత్యేకదృష్టి పెట్టిన కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆశించిన మేరకు పచ్చదనం పెరుగుతోంది. మొదటి నాలుగేళ్లతో పోలిస్తే గ్రామపంచాయతీలు దృష్టి పెడుతున్న కారణంగా ఐదో విడత హరితహారం మెరుగ్గా ఉంది. రైతుల ఎక్కువగా టేకు, ఎర్రచందనం మొక్కలు కోరుకుంటున్నా వాటి పంపిణీ జరగట్లేదు. ఇంటింటికి ఇచ్చే మొక్కలు ప్రజల కోరుకునేవి కాకుండా నర్సరీల్లో ఉన్న గడ్డిగులాబీ వంటి మొక్కలే ఎక్కువగా ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే- గతంలో కంటే హరితహారం ప్రారంభమయ్యాక రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతోంది కానీ.. నాటుతున్న మొక్కల సంఖ్యతో చూస్తే ఆశించిన పచ్చదనం కంటే బాగా తక్కువగా కనిపిస్తోంది.

ఔటర్‌లో:

హెచ్‌ఏండీఏ తన పరిధిలో నాలుగేళ్లలో 3.84 కోట్ల మొక్కలు నాటింది. ప్రధానప్రాంతం ఔటర్‌రింగ్‌రోడ్డే. కానీ ఆ మేరకు మొక్కలు లేవు. వారానికోసారి వచ్చే ట్యాంకర్లు సర్వీసురోడ్ల వెంట వెళుతూ ఉంటే పైపుల్ని పట్టుకుంటా వెళుతున్నారు. మొక్కలు ఓచోట నీళ్లు పడేది మరోచోట. మొక్క వద్ద పడ్డా.. నిలిచేందుకు చుట్టూ గుంతలులేకపోవడంతో నీళ్లు నిలవడం లేదు. ఇంకా కారణాలు ఏంటి?

నిర్వహణ సమస్యలతో పాటు నాటే మొక్కల లక్ష్యం కోట్లు, లక్షల్లో ఉండటం. దీంతో నాటిన అన్ని మొక్కల్ని పర్యవేక్షించడం అధికారులు, సిబ్బందికి సవాలుగా మారుతోంది. 2019-20లో తొలుత 100 కోట్ల లక్ష్యం నిర్దేశించగా.. తర్వాత వీలైనంతగా అంటూ మార్చారు. తాజా లెక్కల ప్రకారం ఈ ఏడాది 37 కోట్లకు పైగా నాటారు.

telangana government officials Neglected haritha haram
హరితహారం ఆరంభ శూరత్వమేనా!

ట్రీ గార్డులు లేక..

వైరాలో లెక్కల్లో తప్ప క్షేత్రస్థాయిలో మొక్కలు లేవు. గత రెండేళ్లలో 20 వేల చొప్పున మొక్కలు నాటేసి గాలికి వదిలేశారు. ఇప్పుడక్కడ కనిపించే మొక్కల సంఖ్య వందల్లోనే ఉంది. రహదారి డివైడర్లపై ఒక్కటీ లేదు. టేకులపల్లి మండలంలో గతేడాది 2.25 లక్షల మొక్కలు నాటితే 35 శాతం వరకే బతికాయి. ఈ ఏడాది 3.25 లక్షల మొక్కల్లో 60 శాతంపైగా మొక్కలు బతికాయి. తల్లాడ మండలంలో గతంలో నాటినవి 30-40 శాతం మించి బతకలేదు. ఈ ఏడాది నాటిన మొక్కలు పచ్చదనంతో కనిపిస్తున్నాయి. అన్నపురెడ్డిపల్లి మండలంలో రహదారుల వెంట, ఖాళీస్థలాల్లో చెరువుగట్ల వెంట, ఇంటికి ఆరేసి మొక్కల చొప్పున ఈ ఏడాది 1.55 లక్షల మొక్కలు అందించారు. అయితే క్షేత్రస్థాయిలో 50 శాతం కూడా కనిపించడం లేదు. పెనుబల్లి మండల కేంద్రంలో ఓ చెరువుగట్టు వద్ద నాటిన మొక్కలు 90 శాతం వరకు చనిపోయాయి. రైతులకు ఇచ్చినవే ఎక్కువగా బతికాయి.

వివరాలిలా...

పచ్చదనం ఉంది కానీ..

ఖిలా వరంగల్‌లో గుండుచెరువు ప్రాంతం.. వేప, మర్రి వంటి మొక్కలు 10 వేల వరకు నాటారు. నీళ్లు పెట్టడం, ఎరువులు వేయడం, కలుపు తీయడం సహా నిర్వహణలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుండటంతో అక్కడ పచ్చదనం పరవళ్లు తొక్కుతోంది. అయితే మొక్కలు నాటడంలో మాత్రం కొద్దిగా కూడా ప్రణాళిక లేదు. మొక్కకు మొక్కకు మధ్య అడుగు దూరమైనా లేదు. మర్రి వంటి భారీ వృక్షాల వేర్లు బాగా చొచ్చుకుపోతాయి. కాండం బాగా పెద్దగా అవుతుంది. కొమ్మలు విస్తరిస్తాయి. పక్కన పక్కన నాటడంతో అవి చనిపోయే అవకాశం ఉంటుంది.

వరంగల్‌

బెస్తం చెరువు పక్కన ప్రభుత్వభూమి.. లక్ష్యం 10 వేల మొక్కలు. అటవీశాఖ 5 వేల మొక్కలు ఇచ్చింది. వేలాది మంది విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. స్మృతివనంగా అభివృద్ధి చేస్తామంటూ అటవీశాఖ చుట్టూ గోడలు కూడా కట్టింది. ఆ తర్వాత మొక్కల నిర్వహణను ‘కుడా’ గాలికి వదిలేసింది. మొక్కలు మేకలు, పశువుల పాలయ్యాయి. మూడు నెలల తర్వాత ఒక్క మొక్క కూడా మిగల్లేదు.

భువనగిరి

అర్బన్‌కాలనీలో రెండేళ్ల క్రితం వెయ్యి మొక్కలు నాటారు. ఒక్కటీ బతకలేదు. అక్కడే గతేడాది మరో వెయ్యి నాటారు. ఇప్పుడక్కడ పట్టుమని 10 మొక్కలు కూడా లేదు. జాతీయరహదారి పక్కన పెద్దచెరువు.. 14 ఎకరాల మున్సిపల్‌ స్థలం.. బస్సుల్లో పిల్లల్ని రప్పించారు. మామిడి, జామ, వేప వంటి 4 వేల మొక్కలను మూడేళ్లక్రితం నాటారు. 8-10 లక్షలు ఖర్చుచేశారు. మొక్కలన్నీ పశువులు, మేకలకు ఆహారమయ్యాయి. వంద మొక్కలు కూడా లేవు.

చౌటుప్పల్‌

దండుమల్కాపురం చెరువుకట్టపై నాలుగేళ్లక్రితం వెయ్యి ఈత, ఖర్జూర మొక్కలు నాటితే నీటి సమస్యతో 40 శాతమే మిగిలాయి. ఇక్కడకు దగ్గరలోని రామలింగేశ్వరస్వామి ఆలయభూముల్లో సీతాఫలం, మామిడి, టేకు మొక్కలు నాటారు. సంరక్షణకు మనుషుల్ని పెట్టడంతో పచ్చదనం కళకళలాడుతోంది. ఆరెగూడంలో భూగర్భజలాల కాలుష్యంతో మొక్కలు సరిగా ఎదగడం లేదు. ఏకంగా నర్సరీనే ఇక్కడినుంచి మార్చేశారు.

ఐనవోలు ఆదర్శం..

గ్రామగ్రామానికి మధ్య రహదారులు ఇరువైపునా ఏపుగా పెరిగిన చెట్లు.. రక్షణకు ట్రీగార్డులు, క్రమం తప్పకుండా ట్యాంకర్లతో నీటి సరఫరా.. వీటి పర్యవేక్షణకు ప్రత్యేకంగా కమిటీలు.. వెరసి మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా పచ్చదనమే. మండల కేంద్రం ఐనవోలులో అయితే వీధివిధిలో, పాఠశాల ప్రాంగణంలో, పశువుల సంత ఎక్కడ చూసినా పచ్చటి మొక్కలే. ఎక్కడైనా మొక్కలు చనిపోతే వాటిస్థానంలో కొత్తవి పెడుతున్నారు. రైతులకు ఆదాయం వచ్చేలా టేకు మొక్కలు ఎక్కువ సంఖ్యలో పంపిణీ చేస్తున్నారు.

జనగామ:

పట్టణంలో నాలుగేళ్లలో 2.20 లక్షల మొక్కలు నాటితే బతికినవి దాదాపు 15 శాతం మించి లేవు. అందులోనూ అత్యధికంగా వరంగల్‌-హైదరాద్‌ రహదారిలోనే. పక్కనే శామీర్‌పేట గ్రామంలో రెండేళ్లక్రితం 16 వేలు నాటితే 40 శాతం కూడా బతకలేదు.

ఇదీ చూడండి- సీడీఎస్​ నియామకం ఓ తప్పటడుగు: కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.