ETV Bharat / state

ప్లాస్టిక్​ నిషేధంపై అధికారుల కసరత్తు - KCR Review on plastic

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్​పై నిషేధం విధించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి జారీ చేసే ఉత్తర్వులు పక్కాగా అమలయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. విధివిధానాలు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్​కు అందించాలని అధికారులు నిర్ణయించారు.

ప్లాస్టిక్​
author img

By

Published : Oct 13, 2019, 5:32 AM IST

Updated : Oct 13, 2019, 7:40 AM IST

ప్లాస్టిక్​ నిషేధంపై అధికారుల కసరత్తు

యాబై మైక్రాన్లలోపు ప్లాస్టిక్ ఉత్పత్తి, వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ ఆచరణలో సాధ్యం కావడంలేదు. తొలుత 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత 50 మైక్రాన్లకు పెంచారు. ప్లాస్టిక్​ విచ్ఛలవిడి వాడకం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టంపై కేంద్రం దృష్టి సారించింది. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్​పై నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా విధివిధానాలు తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశించారు.

70 మైక్రాన్ల వరకు

రాష్ట్ర పర్యావరణశాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు విధివిధానాలపై దృష్టి పెట్టారు. తెలంగాణలో ప్రస్తుతం 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ తయారీపై నిషేధం ఉంది. మందంతో సంబంధం లేకుండా ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తిని నిషేధించాలని భావిస్తున్నారు. తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్​పై ఏ మేరకు నిషేధం ఉంది.. ఎక్కడ ఉత్తమ పద్ధతులున్నాయి.. ఇలా పలు అంశాల్ని పరిశీలిస్తున్న అధికారులు వీటిని సీఎంకు వివరించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కీలకమయ్యే అవకాశాలున్నాయి. ఏవి ఏ పరిధిలోకి వస్తాయో కేంద్రం స్పష్టం చేస్తే తెలంగాణలోనూ అందుకు అనుగుణంగా నిషేధంపై కొత్త ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా ఎక్కువ నష్టం కలిగిస్తున్న.. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్​పై దృష్టి పెట్టింది.

ముఖ్యమంత్రికి నివేదిక

ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా కసరత్తు మొదలు పెట్టామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రస్థాయిలో గట్టిగా అమలవడం... ఇతర రాష్ట్రాల ప్రభావం పడకుండా ఇలా అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విధివిధానాలపై ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్నారు.

ఇదీ చదవండిః హైదరాబాద్​ గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ కాబోతోంది: కేటీఆర్

sample description
Last Updated : Oct 13, 2019, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.