ETV Bharat / state

Polavaram Survey: 'పోలవరం ముంపుపై తక్షణమే సర్వే చేసేలా ఆదేశించండి' - Telangana letter to central water commission

Telangana Letter to CWC on Polavaram Project Survey : పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టేలా చూడాలని సీడబ్లూసీ ఛైర్మన్​కు తెలంగాణ సర్కార్​ లేఖ రాసింది. సుప్రీంకోర్టు నిర్ణయించిన గడువులోగా పీపీఏ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్​ను భాగస్వామిగా చేసినా, చేయకపోయినా ప్రక్రియ పూర్తి చేయాలని లేఖలో విజ్ఞప్తి చేసింది.

Polavaram
Polavaram
author img

By

Published : May 8, 2023, 9:06 PM IST

Telangana Letter to CWC on Polavaram Project Survey : పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ప్రభావంపై సర్వే చేపట్టాలన్న ఆదేశాలపై ప్రాజెక్టు అథారిటీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని.. తక్షణమే సర్వే చేసేలా చూడాలని కేంద్ర జలసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ ఛైర్మన్​కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు పీపీఏ ఆధర్యంలో ఉమ్మడి సర్వే నిర్వహించాలని.. మూడు సాంకేతిక సమావేశాలతో పాటు సమన్వయ సమావేశంలో నిర్ణయించినట్లు అందులో పేర్కొన్నారు.

బ్యాక్ వాటర్స్, ముంపు ప్రభావానికి సంబంధించి పలు అంశాలను లేఖలో పొందుపరిచారు. పోలవరంలో ఎఫ్ఆర్ఎల్ స్థాయిలో నీటిని నిల్వ చేస్తే.. తెలంగాణలో 954 ఎకరాలు ముంపునకు గురవుతుందన్న అంచనా ఉందని పేర్కొన్నారు. దీనిపై పీపీఏ వాస్తవాలు నిర్ధారించుకొని ట్రైబ్యునల్ తీర్పునకు అనుగుణంగా రక్షణ చర్యలు చేపట్టాలని కోరింది. కిన్నెరసాని, ముర్రేడువాగుల నుంచి డ్రైనేజీ ప్రవాహానికి సంబంధించి సీడబ్ల్యూసీ 2021 జూన్​లోనే నివేదిక ఇచ్చిందని.. అందుకనుగుణంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఉమ్మడి సర్వే చేపట్టాలి: దీంతో పాటు దుమ్ముగూడెం.. ఆనికట్ దిగువన గోదావరిలో కలిసే ఏడు స్థానిక ప్రవాహాల కారణంగా ఉత్పన్నమయ్యే ముంపును గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనితోపాటు ఇతర 30 ప్రవాహాలకు కూడా ఇదే కసరత్తు చేయాలని తెలిపింది. భద్రాచలం పట్టణం, మణుగూరు భారజల కేంద్రానికి సంబంధించి ఇంపార్టెంట్ లెవెల్స్​ను తనిఖీ చేసేందుకు.. తక్షణమే ఉమ్మడి సర్వే చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.

మరో 25 రోజుల గడువు మాత్రమే ఉంది: ఈ క్రమంలోనే 2010లో ఆమోదించిన డీపీఆర్​లోని సిఫారసులకు అనుగుణంగా కరకట్టలు నిర్మించేందుకు ఉమ్మడి సర్వే నిర్వహించాలని లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వివరాలు అంది రెండు వారాలు గడచినప్పటికి.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలంగాణ ఆక్షేపించింది. రుతుపవనాల్లోపు సర్వే చేపట్టేందుకు మరో 25 రోజుల గడువు మాత్రమే ఉందని గుర్తు చేసింది.

ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని నిర్ధారించేందుకు వీలుగా.. తక్షణమే సర్వే ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర జలసంఘాన్ని కోరింది. సుప్రీంకోర్టు నిర్ణయించిన గడువులోగా పీపీఏ ఆధ్వర్యంలో సర్వే చేపట్టాలని.. ఏపీని భాగస్వామిగా చేసినా, చేయకపోయినా ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లేఖలో విజ్ఞప్తి చేసింది.

ఇవీ చదవండి: పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలి: సీడబ్ల్యూసీ

Congress Youth Declaration : 'ఐదు శీర్షికలుగా కాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్'

రైల్వే 'వెయిటింగ్ లిస్ట్' దెబ్బ.. టికెట్ కొన్నా 2.7కోట్ల మందికి నిరాశ.. వారిలో మీరూ ఒకరా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.