ETV Bharat / state

Telangana: ఎందుకీ వివక్ష.. మాకో న్యాయం.. కర్ణాటకకో న్యాయమా..? - TS Letter to Centre over Palamuru Rangareddy

Telangana Irrigation Projects: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు ఒక న్యాయం.. ఇతర రాష్ట్రాలకు మరో న్యాయమా? అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల విషయంలో.. కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడింది. కేటాయింపులకు లోబడే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపడితే అనుమతులు ఇవ్వడం లేదని.. అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం.. లేఖను రాసింది.

Irrigation projects
Irrigation projects
author img

By

Published : Apr 19, 2023, 7:18 AM IST

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రానికి ఎందుకంత వివక్ష..?

Telangana Irrigation Projects : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కారు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. సాగు నీటి ప్రాజెక్టుల అంశంలో కేంద్ర తీరును తప్పుబట్టింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్‌కు.. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. ఇందులో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు అంశాన్ని ప్రధానంగా పేర్కొన్నారు.

Telangana Letter to Centre over Palamuru Rangareddy project : కేటాయింపులకు లోబడే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా.. సాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలు వాడుకోవచ్చని గోదావరి ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. ఈ మేరకు వచ్చే 45 టీఎంసీలు, చిన్న నీటిపారుదలలో మిగిలిన 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీలతో పాజెక్టును చేపట్టామని లేఖలో పేర్కొంది. అయితే ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు కోర్టు పరిధిలో ఉన్నాయంటూ డీపీఆర్‌ వెనక్కి పంపించడంలో కేంద్రం అంతర్యం ఏమిటని రజత్ కుమార్ ప్రశ్నించారు. కర్ణాటకలో అప్పర్‌ భద్ర ప్రాజెక్టును కూడా ఇదే తరహాలో చేపట్టారని గుర్తు చేశారు.

Palamuru Rangareddy project Issue : చిన్ననీటిపారుదలలో మిగిలిన జలాలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు తరలించిన వాటాలో వచ్చే జలాల ఆధారంగా అప్పర్‌ భద్రను ప్రతిపాదించారని రజత్ కుమార్ అన్నారు. కేంద్రం ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడమే కాకుండా ఏకంగా జాతీయ హోదా కల్పించి, కేంద్ర బడ్జెట్లో నిధులు కూడా కేటాయించిందని పేర్కొన్నారు. కరవు పీడిత, ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలలో 1200 గ్రామాలకు తాగునీరు, ఆరు జిల్లాల్లో 12 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన పాలమూరు - రంగారెడ్డికి మాత్రం ఎందుకు అన్యాయం చేస్తున్నారని లేఖలో నిలదీశారు. నీటి పారుదల ప్రాజెక్టుల అనుమతి విషయంలో ఒక్కో రాష్ట్రానికి.. ఒక్కోలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు.

Telangana Is Angry With Central Government: 2014ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని కూడా లేఖలో ప్రస్తావించారు. 2021 జూలై 15న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ ప్రకారం.. అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో పాలమూరు - రంగారెడ్డిని చేర్చారని, ఆరు నెలల్లోగా అనుమతులు పొందాలని అందులో పేర్కొన్నారని తెలిపారు. అందుకు అనుగుణంగానే అనుమతుల కోసం డీపీఆర్‌ను సమర్పించినట్లు వెల్లడించారు. అప్పటి నుంచి ఆరు నెలల్లోగా డీపీఆర్‌ను పరిశీలించి, అనుమతులు ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. అయితే ట్రైబ్యునల్‌లో కేసు విచారణ కొనసాగుతోందన్న కారణంతో డీపీఆర్‌ను పరిశీలించలేమని కేంద్ర జలవనరుల సంఘం చెప్పడం అన్యాయమని రజత్ కుమార్ ఆక్షేపించారు.

Palamuru RangaReddy Lift Scheme: జస్టిస్​ బ్రిజేశ్​ కుమార్​ తమకు నీటి కేటాయింపులు చేసే అధికారం లేదన్నారని రజత్ కుమార్ గుర్తు చేశారు. కాబట్టి డీపీఆర్‌ను పరిశీలించి, ట్రైబ్యునల్‌ తుది తీర్పునకు లోబడి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్ పరిశీలన కొనసాగించాలని, త్వరగా అనుమతులు మంజూరు చేసేలా సీడబ్ల్యూసీ ఆదేశించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్​ను కోరారు. కేంద్ర జలసంఘం లేవనెత్తిన అన్ని అంశాలకు ఇప్పటికే సవివరమైన సమాధానాలు సమర్పించామని కూడా రజత్ కుమార్ లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.