Governor Did Not Approve The Entry Of The Budget : తెలంగాణ బడ్జెట్ ప్రవేశానికి గవర్నర్ నుంచి ప్రభుత్వానికి ఇంకా అనుమతి రాలేదు. 10 రోజుల క్రితమే గవర్నర్‌కు ప్రభుత్వం నుంచి లేఖ రాసినప్పటికీ ఇంకా అనుమతి లభించలేదు. దీంతో ప్రభుత్వం తదుపరి చర్యలపై దృష్టి సారించింది. న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు ఆలోచనలు చేస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ శుక్రవారం నుంచే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారమే ఉభయసభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా పరిణామాలు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గత కొద్దిరోజులుగా గవర్నర్, కేసీఆర్ ప్రభుత్వానికి బహిరంగంగానే వివాదం జరుగుతోంది. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం తనను దూరంగా ఉంచుతున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరోపిస్తుంటే.. గవర్నర్గా పనిచేస్తూ ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా ఆమె.. తమ బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా ఈ వివాదం రాష్ట్రంలో రాబోయే కాలంలో ఏ పరిస్థితులకు దారి తీస్తాయో చూడాలి.
ఇవీ చదవండి: