రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేసింది. రాష్ట్రంలో బయట తిరిగే ప్రతిఒక్కరు కచ్చితంగా మాస్కు ధరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో మాస్కు లేకుండా తిరిగే వారికి రూ. 1,000 జరిమానా విధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జనసాంద్రత కలిగిన ప్రదేశాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ప్రజారవాణా, ఇతర పనిప్రదేశాల్లో కచ్చితంగా మాస్కులు ధరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఈ ఆదేశాలు తప్పకుండా అమలు చేయాలని ఉత్వర్వుల్లో వెల్లడించారు.
ఇదీ చూడండి: వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతి