రాష్ట్ర ప్రభుత్వం ఉజ్వల గృహాలు నిర్వహించేందుకు స్టేట్ లెవల్ కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. మహిళాశిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టుకు మహిళ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా విధులు నిర్వహించనున్నారు. ఆర్థిక, కార్మికశాఖల అధికారులు ఇందులో సభ్యులుగా కొనసాగనున్నారు.
సంఘ జీవనం గడిపేలా
రాష్ట్రంలో ఉమెన్ ట్రాఫికింగ్ ను తగ్గించి.. బాధితుల పునరావాస చర్యల కొరకు 2007 లో రాష్ట్ర ప్రభుత్వం ఉజ్వల ప్రాజెక్టును తీసుకువచ్చింది. ఆ ప్రాజెక్టుకు కొనసాగింపుగా బాధిత మహిళలు మరింత కుటుంబ, సంఘ జీవనం గడిపేలా దోహదపడేందుకు ఉజ్వల హోమ్స్ పేరిట ఈ కొత్త ప్రాజెక్టుకు అంకురార్పన చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి:పురపాలికలకు నిధులివ్వండి.. కేంద్రమంత్రులకు కేటీఆర్ లేఖ