విజయ డైరీ రైతులకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభవార్త తెలిపారు. పాల సేకరణ ధర పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన పాడి రైతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో పాడి రైతుల విజ్ఞప్తి మేరకు గేదె పాలు లీటరు ధర 46.69 రూపాయల నుంచి 49.40 రూపాయలకు పెంచినట్లు ప్రకటించారు. ఆవు పాల ధర 33.75 నుంచి 38.75 రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు.
పాడి రైతుల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాయితీపై పాడి గేదెలు, ఉచితంగా ఔషధాలు, పశుగ్రాసం విత్తనాలు, వైద్య సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందుకు నష్టాల్లో కొనసాగుతోందని... ఇక మూసేస్తారన్న ప్రచారాలకు భిన్నంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత విజయ డెయిరీ లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు.
ప్రైవేటు డెయిరీలకు ధీటుగా పాలు, పాల ఉత్పత్తులు విజయ డెయిరీ అందిస్తున్న దృష్ట్యా... నాణ్యమైన విజయ పాలు మాత్రమే వినియోగదారులు వాడాలని సూచించారు. కొవిడ్ నేపథ్యంలో... ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కొన్ని ఇబ్బందులు ఉత్పన్నమమైన తరుణంలో అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ - సహకార రంగ డెయిరీలకు పాలు పోసే రైతుల సంఘం సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి తలసాని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:
కాంగ్రెస్‌కు డాక్టర్ బదులు కాంపౌండర్ల వైద్యం, ఏ క్షణమైనా పార్టీ శిథిలం
హిజాబ్ బ్యాన్పై సుప్రీం కీలక నిర్ణయం, రఫేల్ స్కామ్‌పై విచారణకు నో