ETV Bharat / state

నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్‌..! - Hyderabad latest news

Inauguration of new secretariat building: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న తెలంగాణ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఇటీవలే సచివాలయ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ ఈ ఏడాది చివరి నాటికి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు తాజాగా కేసీఆర్​ స్వయంగా సచివాలయ ప్రారంభానికి డేట్​ ఫిక్స్​ చేసారని ప్రాథమిక సమాచారం.

నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్‌..!

author img

By

Published : Nov 29, 2022, 10:29 AM IST

Inauguration of new secretariat building: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి వచ్చే జనవరి 18న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఆరోజున 6వ అంతస్తులోని సీఎం బ్లాకును ప్రారంభించి.. తన ఛాంబర్​లో కేసీఆర్‌ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆ రోజు నుంచి అక్కడే ప్రభుత్వ కార్యకలాపాలు సాగనున్నాయి.

ఈ గడువులోగా పనులన్నీ పూర్తిచేసి సర్వాంగసుందరంగా సచివాలయాన్ని సిద్ధం చేయాలని ఆయన అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను సోమవారం ఆదేశించారని తెలిసింది. ఇటీవల సచివాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన సందర్భంగా.. పనులను వేగవంతం చేయాలని, సంక్రాంతి తర్వాత ప్రారంభోత్సవం ఉంటుందని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. జనవరి 18న మంచి ముహూర్తం ఉండడంతో ఆ రోజునే ప్రారంభోత్సవం జరపాలని సీఎం భావిస్తున్నారని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.