ETV Bharat / state

Diagnostic Centers: రాష్ట్రంలో మరో 13 డయాగ్నొస్టిక్‌ కేంద్రాలు... జిల్లాకో నిర్ధారణ కేంద్రం - 8 more virology laboratories set up in the state

రాష్ట్రంలోని ‘తెలంగాణ నిర్ధారణ కేంద్రాల (టి-డయాగ్నొస్టిక్స్‌)’ పథకాన్ని అన్ని జిల్లాలకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 20 జిల్లాల్లో నిర్ధారణ పరీక్షల కేంద్రాలను నెలకొల్పగా.. మరో 13 చోట్ల నెలకొల్పేందుకు తాజాగా ఆదేశాలిచ్చింది.

Diagnostic Centers
Diagnostic Centers
author img

By

Published : Nov 10, 2021, 5:03 AM IST

‘తెలంగాణ నిర్ధారణ కేంద్రాల (టి-డయాగ్నొస్టిక్స్‌)’ పథకాన్ని అన్ని జిల్లాలకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 20 జిల్లాల్లో నిర్ధారణ పరీక్షల కేంద్రాలను నెలకొల్పగా.. మరో 13 చోట్ల నెలకొల్పేందుకు తాజాగా ఆదేశాలిచ్చింది. ఇవికాకుండా రాష్ట్రవ్యాప్తంగా మరో 8 వైరాలజీ ప్రయోగశాలలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది (set up 13 more diagnostic centers and 8 virology laboratories in the state). వీటికి సంబంధించి రూ.96.39 కోట్లు విడుదల చేసింది. ఈ కేంద్రాల్లో 56 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. మొదట నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) ఆవరణలో ‘తెలంగాణ డయాగ్నొస్టిక్‌ కేంద్రాన్ని’ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో పూర్తిస్థాయిలో వాటంతటవే పరీక్షలు నిర్వహించి, ఫలితాలను వెల్లడించే రూ.3 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలు (ఫుల్లీ ఆటోమేటెడ్‌ మిషన్స్‌) మూడు ఉన్నాయి.

హైదరాబాద్‌ నగర పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (Urban health centers), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (Community Health Centers), ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులన్నీ దీని పరిధిలోకి వస్తాయి. రోజూ బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన నమూనాలను ఈ ప్రయోగశాలకు చేరుస్తారు. రోగుల నుంచి నమూనాలు సేకరించినప్పుడే వారి ఈ-మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌ తీసుకుంటారు. ఈ పరికరమే ఆన్‌లైన్‌లో.. రోగికి, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, బస్తీ దవాఖానాకు రోగ నిర్ధారణ ఫలితాలను పంపిస్తుంది. ఈ విధానం విజయవంతమవడంతో.. మూడు నెలల క్రితం మరో 19 జిల్లాల్లోనూ ఇలాంటి కేంద్రాలను స్థాపించి ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలను వాటికి అనుసంధానం చేశారు. దీంతో సులువుగా రోగులు పరీక్షల ఫలితాలను పొందగలుగుతున్నారు. జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో 13 కేంద్రాలను తాజాగా మంజూరుచేసింది. ఆరు నెలల్లో వీటి నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించింది. వీటి కోసం రూ.73.29 కోట్లను విడుదల చేసింది.

జిల్లాకొక ఆధునిక ప్రయోగశాల

కొవిడ్‌ సహా ఇతర వైరాలజీ పరీక్షలను కూడా నిర్ధారించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అత్యాధునిక వైరాలజీ ప్రయోగశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది (8 virology laboratories in the state). ఇప్పటికే రాష్ట్రంలో 25 ప్రయోగశాలలను ఏర్పాటు చేయగా.. తాజాగా జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగర్‌కర్నూల్‌, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌, నారాయణపేట జిల్లాల్లోనూ వైరాలజీ ల్యాబ్‌లను నెలకొల్పనున్నారు. వీటి నిర్మాణం కోసం రూ.10.61 కోట్లను, మరో రూ.12.49 కోట్లను నిర్వహణ వ్యయం కింద ప్రభుత్వం మంజూరు చేసింది. ఆరునెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాల్లో పేర్కొంది.

ఎక్కడెక్కడ?

1. జయశంకర్‌ భూపాలపల్లి, 2. కామారెడ్డి, 3.మంచిర్యాల, 4. మేడ్చల్‌ మల్కాజిగిరి, 5. నాగర్‌ కర్నూల్‌, 6. నారాయణపేట, 7. పెద్దపల్లి, 8. రంగారెడ్డి, 9 సూర్యాపేట, 10.వనపర్తి, 11. వరంగల్‌, 12. హనుమకొండ, 13. యాదాద్రి భువనగిరి.

ఇదీ చూడండి: tharun chug: 'ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారిని కేంద్రం గమనిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.