ETV Bharat / state

'ఆదాయ పెంపు మార్గాలపై సర్కార్ దృష్టి... ఎక్కువ రాబడి పొందేలా చర్యలు'

ఆదాయ పెంపు మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఖజానాకు వీలైనంత ఎక్కువగా రాబడిని పొందేలా వివిధ చర్యలు తీసుకుంటోంది. భూముల విలువ, రిజిస్ట్రేషన్ రుసుము పెంపు, భూముల అమ్మకం సహా వివిధ కార్యాచరణను అమలు చేస్తోంది. తాజాగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించే దిశగా కూడా సర్కార్ సిద్ధమైంది.

Telangana
సర్కార్
author img

By

Published : Jul 21, 2021, 7:22 PM IST

కరోనాతో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. లాక్​డౌన్ (Lockdown) సమయంలో పూర్తిగా స్తంభించిపోయాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి(State Government) రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోయింది. నిరుటితో పాటు ఈ ఏడాది లాక్​డౌన్ సమయంలో సర్కార్ ఖజానాకు వచ్చే రాబడి పూర్తిగా తగ్గిపోయింది. లాక్​డౌన్ ఎత్తివేశాక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ మునుపటి పరిస్థితులు లేవు.

కోలుకోని వివిధ రంగాలు...

ప్రత్యేకించి కొనుగోళ్లు, పర్యాటకం, ఆతిథ్యరంగం కోలుకోలేదు. తద్వారా వాటి రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కోల్పోయింది. ఆ ఆదాయాన్ని రాబట్టుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది. నిధుల సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసి కసరత్తు చేస్తోంది. ఆదాయాన్ని పెంచుకునే వివిధ మార్గాలపై ఉపసంఘంలో చర్చించారు. కేబినెట్​లోనూ చర్చించి పలు నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు.

నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా ఈ ఏడాది కనీసం పదివేల కోట్ల రూపాయలు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇటీవల 500 ఎకరాల భూముల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 2,700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. రికార్డు ధర పలికిన నేపథ్యంలో అదే ఊపుతో మరో దఫా భూముల అమ్మకానికి కూడా సర్కార్ సిద్ధమవుతోంది.

ఆదాయ మార్గాలు...

సుధీర్ఘంగా పెండింగ్​లో ఉన్న భూముల విలువ పెంపు, రిజిస్ట్రేషన్ల రుసుం పెంపుపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఎనిమిదేళ్ల తర్వాత వ్యవసాయ, వ్యవసాయేతర, భూములు, ఆస్తుల విలువను పెంచారు. దీంతో పాటు రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ రుసుం కూడా పెంచారు. భూముల విలువ, రిజిస్ట్రేషన్ రుసుం పెంపు ద్వారా ఈ ఏడాది అదనంగా రూ. 4,000 కోట్లు సమకూరుతాయని అంచనా. మద్యం, డీజిల్ విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం బాగానే వస్తోంది.

కరోనా, వివిధ కారణాల రీత్యా తగ్గిన బీర్ల వినియోగాన్ని పెంచేలా ప్రత్యేక సుంకాన్ని పది రూపాయల మేర తగ్గించారు. కొనుగోళ్లు పెంచే విషయమై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలను ఆకర్షించేలా రాయితీలు ఇవ్వాలని, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని షాపింగ్ మాల్స్​కు సూచించింది. వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తుల కొనుగోళ్లకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు తెలిపింది. ప్రత్యేకంగా రుణమేళాలు నిర్వహించడంతో పాటు ప్రక్రియను సరళతరం చేయాలని సూచించింది.

మార్గదర్శకాల జారీ...

సినిమా థియేటర్లు కూడా తెరిచేలా చర్యలు తీసుకుంది. పార్కింగ్ రుసుంకు సంబంధించి కూడా వెసులుబాటు కల్పించింది. వీటితో పాటు తాజాగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2020లో ఎల్ఆర్ఎస్ స్కీంను రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తీసుకొచ్చారు. దాదాపుగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వివిధ కారణాల రీత్యా ఆ దరఖాస్తుల పరిశీలనా ప్రక్రియ పూర్తి కాలేదు. తాజాగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

క్లస్టర్ల వారీగా విభజన...

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్నింటినీ క్లస్టర్ల వారీగా విభజన, ఆ తర్వాత క్లస్టర్ల తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. మొత్తం ప్రక్రియను పక్షం రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత తదుపరి మార్గదర్శకాలు జారీ అవుతాయని తెలిపింది. ఎల్ఆర్ఎస్ ద్వారా కనీసం పదివేల కోట్ల రూపాయలు ఖజానాకు వస్తాయని అంచనా వేశారు. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అవకాశమున్న అన్ని మార్గాల ద్వారా ఖజానాకు రాబడి పెంచుకునేలా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది.

ఇదీ చూడండి: Telangana Rains: రాష్ట్రంలో రాగల మూడురోజులు అతి భారీ వర్షాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.