NGT imposed fine on Telangana Govt: ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో గతంలో జారీచేసిన మార్గదర్శకాలు, తీర్పులు అమలు చేయలేదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్- ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. తెలంగాణకు 3800 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లో ప్రత్యేక అకౌంట్‌లో జమ చేయాలని ఆదేశించింది. వ్యర్ధాల నిర్వహణకు సత్వర చర్యలు చేపట్టి పురోగతి తెలిపాలని సూచించింది.
మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య, వ్యర్థాల నిర్వహణ సరిగా చేయడం లేదని పర్యావరణ సురక్షా స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను 2014లో ఎన్జీటీకి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. 351 నదీ పరీవాహక ప్రాంతాలు, 124 నగరాల్లో గాలి కాలుష్యం.. 100 కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాలు, అక్రమ ఇసుక మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ కోరింది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై విచారణ చేపట్టిన ఎన్జీటీ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి వివరణ కోరింది. తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని హరిత ట్రైబ్యునల్ 3800 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఇవీ చదవండి: బండి సంజయ్ అయిదో విడత ప్రజాసంగ్రామ యాత్ర వాయిదా.. అదే కారణమా!
థాయిలాండ్ మహిళకు పూనిన కాళీమాత.. భక్తులకు అభయం.. దర్శనానికి స్థానికుల క్యూ..