ETV Bharat / state

TS government: జిల్లాల్లో కొలువుల భర్తీ... కలెక్టర్లను ఆదేశించిన ప్రభుత్వం! - government decided to fill the vacant posts

ఉద్యోగ నియామకాల్లో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. కొత్తగా ఆర్డర్‌ టు సర్వ్‌ ఉద్యోగులను వారి సొంత జిల్లాలకు తిరిగి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో ఖాళీలపై స్పష్టత వస్తున్నందున ఆ వివరాలు తీసుకొని.. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సేకరించిన జాబితాకు జత చేసి అన్నీ కలిపి భర్తీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో జిల్లా కేంద్రం, మండలాల వారీగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

job-placements
జిల్లాల్లో కొలువుల భర్తీ
author img

By

Published : Sep 7, 2021, 6:43 AM IST

తెలంగాణలో త్వరలో చేపట్టనున్న ఉద్యోగ నియామకాల్లో భాగంగా జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులనూ భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 33 జిల్లాల కలెక్టరేట్లు, మండలాలవారీగా ఖాళీల వివరాలను వెంటనే ఆర్థిక శాఖకు ఆన్‌లైన్‌లో పంపించాలని కలెక్టర్లను సోమవారం ఆదేశించింది. ఖాళీల వివరాలపై నిర్ణీత నమూనా పత్రాన్ని సైతం జిల్లా అధికారులకు పంపించింది.

2016లో కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటి నుంచి నియామకాలు జరగలేదు. ఉమ్మడి జిల్లాల్లో ఉన్న సిబ్బందినే సర్దుబాటు చేశారు. తాజాగా భారీ ఎత్తున పదోన్నతులు కల్పించడంతో కింది స్థాయి పోస్టులు సైతం ఖాళీ అయ్యాయి. మరోవైపు ఇప్పటికే జోనల్‌ విభజనను ప్రభుత్వం పూర్తి చేసింది. ఏయే క్యాడర్‌లో ఎవరెవరు ఉంటారో తేల్చింది. కొత్తగా ఆర్డర్‌ టు సర్వ్‌ ఉద్యోగులను సైతం వారి సొంత జిల్లాలకు తిరిగి కేటాయించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో ఖాళీలపై స్పష్టత వస్తున్నందున ఆ వివరాలు తీసుకొని.. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సేకరించిన జాబితాకు జత చేసి అన్నీ కలిపి భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఏయే పోస్టులు..

జూనియర్‌ అసిస్టెంటు, స్టెనో/టైపిస్టు, రికార్డ్‌ అసిస్టెంటు, డ్రైవర్‌, ఆఫీస్‌ సబార్డినేట్ల పోస్టులు భర్తీకానున్న జాబితాలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మంజూరు పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, జిల్లాల విభజన అనంతరం కొత్త వాటిలో అవసరనమైన పోస్టులు, పనిచేస్తున్న వారి వివరాలను మొత్తం 594 మండలాల నుంచి తీసుకొని ఇవ్వాలని సర్కారు ఆదేశించింది. ఆయా జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్య, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం (లొకేషన్‌) వివరాలు సైతం ఇవ్వాలని సూచించింది.

ఎన్ని తేలేనో..

2016లో పది జిల్లాలను పునర్‌ వ్యవస్థీకరించి మరో 21 కొత్త జిల్లాల స్థాపన సందర్భంగా అవసరమైన పోస్టులు 2,204గా గుర్తించారు. 2019లో మరో రెండు (ములుగు, నారాయణపేట) జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత మొత్తం పోస్టులను అంచనా వేయలేదు. తాజాగా అన్ని జిల్లాల సమాచారం తీసుకుంటే స్పష్టమైన వివరాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త జిల్లాల్లో పోస్టులపై స్పష్టత వచ్చాక.. వాటిని మొత్తం ఖాళీలలో కలిపి భర్తీ చేయాలని ప్రణాళిక రచిస్తోంది.

ఇదీ చూడండి: KTR: జీహెచ్​ఎంసీ తెరాస నేతలతో నేడు కేటీఆర్ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.