ETV Bharat / state

ఇంటర్​ సిలబస్​ 30 శాతం తగ్గింపునకు తెలంగాణ సర్కారు ఆమోదం - తెలంగాణలో 30 శాతం తగ్గనున్న ఇంటర్ సిలబస్

తెలంగాణ ఇంటర్మీడియట్​ పాఠ్య ప్రణాళిక 30 శాతం తగ్గింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలోని 804 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

tg government on inter syllabus
ఇంటర్​ సిలబస్​ 30 శాతం తగ్గింపునకు తెలంగాణ సర్కారు ఆమోదం
author img

By

Published : Sep 18, 2020, 6:50 AM IST

ఇంటర్‌మీడియట్‌లో 30 శాతం పాఠ్య ప్రణాళిక తగ్గింపునకు మార్గం సుగమమైంది. తమ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ వెల్లడించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోని సబ్జెక్టుల్లో సీబీఎస్‌ఈ కొన్ని పాఠ్యాంశాలను తొలగించింది. ఇక్కడా అదే పద్ధతి అమలు చేస్తారు. ఇక ఆర్ట్స్‌ గ్రూపులకు సంబంధించి నిపుణుల కమిటీలను నియమించినందున వాటి సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకుంటారు. ప్రవేశాలకు అనుమతి ఇచ్చినందున ఇప్పటివరకు వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలోని 804 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు జారీ చేశారు. అన్ని రకాల నిబంధనలను పాటిస్తూ దరఖాస్తు చేసిన మరో 77 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలకు కూడా అనుబంధ గుర్తింపు జారీ చేశామని ఆయన తెలిపారు.

పరీక్ష రాయని వారిపై త్వరలో నిర్ణయం

పరీక్ష రుసుం చెల్లించి, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయని దాదాపు 27 వేలమందిని ఉత్తీర్ణులను చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని, దానిపై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని జలీల్‌ తెలిపారు. ఈనెల 1 నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభం కాగా శుక్రవారం నుంచి ప్రథమ సంవత్సరం టీవీ పాఠాలు మొదలుకానున్నాయి. వాటిని తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఒకేసారి ప్రసారం చేయనున్నారు.

ఇదీ చూడండి:సందర్శకుల మనసు దోచుకుంటున్న బోడకొండ జలపాతం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.