స్వయం సహాయక సంఘాలకు రుణాలు అనుసంధానంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికానికే 17.56 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ నేషనల్ రూరల్ లైవ్ లీ వుడ్స్ మిషన్ వెల్లడించింది.
తెలంగాణకు మొదటి స్థానం రావటంతో సంబంధిత అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. ఉపాధి హామీ తరహాలో నిర్ణీత లక్ష్యాన్ని ముందే సాధించాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతోనే ఇది సాధ్యమైందని ఎర్రబెల్లి తెలిపారు.
ఇవీ చూడండి: ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన