ETV Bharat / state

ఖజానాకు కష్టకాలం... గట్టెక్కేందుకు వ్యూహం - తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి

రాష్ట్ర ఖాజనాపై ఒత్తిడి పెరుగుతున్నందున ప్రభుత్వం ఆర్థిక సమీక్షకు సిద్ధమైంది. రాబడుల అంచనాలను, అందుకోకపోగా తగ్గుతుండటం ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆదాయ, వ్యయాల మధ్య పెరుగుతున్న అంతరాన్ని అధిగమించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. మరో రెండు రోజుల్లో జరగనున్న మంత్రిమండలి సమావేశానికి సమగ్ర వివరాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

telangana financial position is very weak
తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి
author img

By

Published : Dec 9, 2019, 6:49 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి

రాష్ట్ర ఖజానా లోటును పూరించేందుకు సర్కారు కసరత్తు ప్రారంభించింది. రానున్న నాలుగు నెలల కార్యాచరణతోపాటు 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ రూపకల్పనపై మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు.

శాఖలవారీ కేటాయింపుల వ్యయం, నాలుగు నెలల్లో పాటించాల్సిన ఆర్థిక నియంత్రణపై దిశానిర్ధేశం చేయనున్నారు. రాష్ట్ర ఖజానకు ప్రతి నెలా కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా నిధులు తగ్గడం, రాబడుల అంచనాల్లో అంతరం పెరుగినట్లు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా, పెండింగ్ నిధులు, జీఎస్టీ పరిహారం, కేంద్ర ప్రాయోజిత పథకాలకు అందిన నిధుల లెక్కను మంత్రి మండలికి అర్థిక శాఖ వివరించనుంది.

ఆదాయం 45... వ్యయం 50

రుణాలు కాకుండా రాష్ట్రానికి సొంత పన్నుల రాబడి, కేంద్ర పన్నుల వాటా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లు, పన్నేతర రాబడిని లక్షా 13 వేల 99 కోట్లుగా అంచనాల వేయగా... అక్టోబర్‌ చివరి నాటికి 51వేల 355 కోట్లు మాత్రమే వచ్చింది. ఇది రాబడుల అంచనాల్లో 45 శాతం మాత్రమే చేరుకుంది. అప్పుల ద్వారా 24 వేల 81 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉండగా... అక్టోబరు నాటికే 17 వేల 500 కోట్లు రుణం తీసుకుంది. లక్షా 37 వేల 226 కోట్లు అంచనా వేయగా... ఇప్పటికే 68 వేల 882 కోట్ల వ్యయంతో 50 శాతం ఖర్చు చేసింది.

ఆర్థిక మందగమనం కొనసాగనుందా?

నాలుగు నెలల్లో కూడా ఆర్థికంగా మందగమనం కొనసాగనుందని ఆర్థకశాఖ అంచనా వేసింది. దీనికి అనుగుణంగా ఖర్చును నియంత్రించుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వేతనాలు, పింఛన్లు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య పథకాల నిధుల్లో కోతలు ఉండకుండా... ఎక్కడెక్కడ నియంత్రించుకోవాలో సమీక్షించనున్నట్లు తెలిపారు.

అక్టోబర్‌ వరకు వచ్చిన పన్నుల రాబడులు గత ఏడాది కంటే తగ్గాయి. ప్రధానంగా జీఎస్టీ రాబడి, కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదల... రాష్ట్ర ఆదాయంపై ప్రభావం చూపాయి. జీఎస్టీలో గత ఏడాది కంటే తక్కువ రాబడులు ఉన్నాయి. రాష్ట్ర రాబడుల్లో కీలకమైన అమ్మకం, ఎక్సైజ్ పన్నుల్లో గతేడాది కంటే స్వల్పంగా పెరిగింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ రాబడి మాత్రం లక్ష్యంలో 60 శాతం పైగా వచ్చింది.

రాష్ట్ర పన్ను, ఇతర రాబడులు అక్టోబర్‌ వరకు రూ. కోట్లలో

పన్ను, రాబడులు 2019 లక్ష్యం 2019 అక్టోబర్‌ శాతం

జీఎస్టీ 31,186 14,087 40

అమ్మకం పన్ను 21,972 10,656 49

స్టాంపులు రిజిస్ట్రేషన్‌ 6,146 3,716 60

ఎక్సైజ్‌ 10,901 6,176 57

పన్నేతర రాబడి 15,875 2,442 15

కేంద్ర పన్నుల వాటా 14,348 6,404 45

గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ 8,177 5,136 63

రుణాలు 24,081 17,500 67

2019-20 వ్యయం అక్టోబర్‌ వరకూ రూ. కోట్లలో

అంశం అంచనా వ్యయం
రెవెన్యూ అకౌంట్‌ 54,736 25,716
వడ్డీలపై చెల్లింపులు 14,574 6,586
వేతనాలు 22,616 14,146
పింఛన్లు 10,332 6,104
సబ్సీడీలు 8,795 3,441
క్యాపిటల్‌ వ్యయం 17,277 8,839
రుణాలు, అడ్వాన్స్‌లు 8,896 4,055

TG_hyd_49_09_sit_on_encounter_av_3181326 రిపోర్టర్- శ్రీకాంత్ ( ) చటాన్ పల్లి ఎన్ కౌంటర్ పై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం కార్యాచరణ ప్రారంభించింది. మల్కాజ్ గిరి లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సిట్ భేటీ అయింది. దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న సీపీ మహేష్ భగవత్ సభ్యులతో సమీక్షించారు. ఏడుగురు సభ్యుల బృందంతో ఎన్ కౌంటర్ పై మహేష్ భగవత్ సమీక్ష నిర్వహించారు. సిట్ బృందానికి సీపీ పని విభజన చేశారు. ప్రతేక దర్యాప్తు బృందం లో ఏడుగురు సభ్యులలో వనపర్తి ఎస్పీ అపూర్వ రావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్, రాచకొండ అదనపు డీసీపీ సురేందర్ రెడ్డి, సంగా రెడ్డి డిఎస్ పి శ్రీధర్ రెడ్డి, రాచకొండ ఐటీ సెల్ సీఐ శ్రీధర్ రెడ్డి, కొరటాల సీఐ శేఖర్ రెడ్డి, సంగా రెడ్డి సిఐ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.