ETV Bharat / state

రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్‌ : సీఎం కేసీఆర్​ - సీఎం కేసీఆర్​ తాజా వార్తలు

రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో కంటైన్​మెంట్​ ఏరియాలు తప్ప మిగతా అన్ని జోన్లను గ్రీన్​ జోన్లుగా ప్రకటిస్తున్నామని తెలిపారు. 1452 కుటుంబాలు మాత్రమే కంటైన్​మెంట్​ ఏరియాల్లో ఉంటాయని అన్నారు.

Everything except containment areas is GreenZone: CM KCR
రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్‌ : సీఎం కేసీఆర్​
author img

By

Published : May 18, 2020, 8:24 PM IST

Updated : May 18, 2020, 8:34 PM IST

తెలంగాణలో ఈ నెలాఖరు వరకు లాక్​డౌన్ పొడిగించారు. ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో విస్తృత చర్చ అనంతరం లాక్​డౌన్​పై పలు నిర్ణయాలు ప్రకటించారు.

రాష్ట్రంలో కంటైన్‌మెంట్ ప్రాంతాలు తప్ప మిగతావన్నీ గ్రీన్‌జోన్లేనని ముఖ్యమంత్రి ప్రకటించారు. 1452 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్‌ ఏరియాల్లో ఉంటాయి. పూర్తిగా పోలీసు పహరాలోనే ఈ ప్రాంతాలు ఉంటాయి. ఈ పరిధిలో ఉండే కుటుంబాలకు నిత్యావసరాలు ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

హైదరాబాద్ నగరం తప్ప అన్నిచోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చని సీఎం తెలిపారు. రాజధాని పరిధిలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎక్కడ దుకాణాలు తెరవాలో నిర్ణయిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరిచేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్‌ : సీఎం కేసీఆర్​

ఇదీ చూడండి : 'బైంసా బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తా'

Last Updated : May 18, 2020, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.