తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లోని రైలు కోచ్‌లలో లైటింగ్, శీతలీకరణకై అవసరమయ్యే విద్యుత్ ఉత్పాదనకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ నెల 7వ తేదీ నుంచి దక్షిణ మధ్య రైల్వే అమలులోకి తెచ్చింది. హెడ్ అండ్ జనరేషన్ వ్యవస్థ ఇంజిన్‌ను తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ప్రవేశపెట్టడం వల్ల దాదాపుగా ఏడాదికి 1.35 కోట్లు ఆదా అవుతుందని ద.మ రైల్వే మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు.
కాలుష్య నివారణ సాధ్యం
సరికొత్త వ్యవస్థతో డీజిల్ వినియోగం, వాయు, శబ్ద కాలుష్యం తగ్గుతుంది. సగటున ప్రతి ట్రిప్పుకు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ పై రెండు లక్షల రూపాయల ఇంధనం ఖర్చు అవుతుంది. ఈ పరిజ్ఞానంతో కేవలం విద్యుత్ వినియోగానికి 78 వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. దీని వల్ల సుమారుగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ప్రతీ ట్రిప్పుకి 1.22 లక్షల రూపాయలు ఆదా అవుతుంది. ఈ పద్ధతి పర్యావరణ పరిరక్షణకు ఊతమిస్తూ కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఉపయోగపడుతుందని ద.మ రైల్వే మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. ఇంజిన్ నడపుట, కోచ్‌లను లాగుటకు అవసరమయ్యే విద్యుత్‌ను మాత్రమే నేరుగా పాంటోగ్రాఫ్‌తో తీసుకునే వారని ఇప్పుడు అదే వ్యవస్థతో కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
ఎన్డ్ అన్ జనరేటర్ (ఇఓజీ) పవర్ కార్లు
గతంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్‌లో విద్యుత్ అవసరాలను తీర్చడానికి రెండు వైపుల ఎన్డ్ అన్ జనరేటర్ (ఇఓజీ) పవర్ కార్లు ఉండేవని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి సి.హెచ్.రాకేష్ తెలిపారు. ఈ పవర్ కార్లు డీజిల్‌తో, విద్యుత్ ఉత్పత్తి చేసేవని, పవర్ కార్ల వల్ల నాన్ ఏసీ కోచ్‌లకు విద్యుత్ ఉత్పత్తికై గంటకు 40 లీటర్ల డీజిల్, ఏసీ కోచ్‌లకు 65 నుండి 70 లీటర్ల వినియోగం జరిగేదన్నారు.
డీజిల్ వినియోగం, కర్బన ఉద్గారాల తగ్గింపు దిశలో భాగంగా ఈ సరికొత్త హెచ్‌ఓజీ వ్యవస్థను తెలంగాణ ఎక్స్‌ప్రెస్ తోపాటు మరిన్ని రైళ్లలో ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి :అధికార దంపతుల నిబద్ధత... బురదలో వెళ్లి డ్యాం పరిశీలన...