ETV Bharat / state

Telangana Election Survey 2023 : సర్వేల్లో నోరు విప్పని ప్రజలు.. ఏం అర్థంకాక అభ్యర్థుల మల్లగుల్లాలు - హైదరాబాద్ ఎన్నికల సర్వేలు

Telangana Election Survey 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నాయకులలో గుబులు పుడుతోంది. ఆలోపు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు, అభ్యర్థుల యత్నాలు ఊపందుకున్నాయి. జనం అంతరంగం తెలుసుకొనేందుకు రూ.లక్షలు వెచ్చించి చేయించిన సర్వేల్లోనూ ఓటరు నాడి అంతుబట్టక అయోమయంలో పడుతున్నారు.

Survey On Telangana Assembly 2023 Elections
Telangana Election Survey 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 31, 2023, 5:52 AM IST

Telangana Election Survey 2023 : తెలంగాణలో చలిగాలులు వీస్తున్నా.. రాజకీయ పరిణామాలు వేడెక్కిస్తున్నాయి. నాయకుల గెలుపోటములపై స్పష్టత రాక మల్ల గుల్లాలు పడుతున్నారు. జనం అంతరంగం తెలుసుకొనేందుకు రూ.లక్షలు వెచ్చించి చేయించిన సర్వేల్లోనూ ఓటరు నాడి అంతుబట్టక అయోమయంలో పడ్డారు. మరోసారి సర్వేలతో తమ బలం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయంపై ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నా లోలోపల ఓటర్ల మనసు గుర్తించలేక మథనపడుతున్నారు.

Survey On Telangana Assembly 2023 Elections : ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో అనే ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొందరు అభ్యర్థులు ప్రముఖ సంస్థలతో సర్వేలు చేయిస్తున్నారు. తెలంగాణలో కొన్ని సర్వే సంస్థలు సర్వే చేయగా 100లో 25 మంది ప్రజలు మాత్రమే తాము ఏ పార్టీ అభ్యర్థికి మద్ధతు పలుకుతామనేది వెల్లడించారు. శేరిలింగంపల్లిలో ఒక సర్వే సంస్థ తరఫున కొందరు విద్యార్థులు రెండు కాలనీల్లో సర్వేకు వెళ్లారు. సుమారు 200మంది నుంచి అభిప్రాయం సేకరించారు. వారిలో సగం మంది మాత్రమే తాము ఏ పార్టీ/అభ్యర్థికి మద్దతు ఇస్తామనేది తెలిపారు. మిగిలిన వారంతా ‘అప్పుడు చూద్దా’మంటూ బదులిచ్చారంటూ సర్వేలో పాల్గొన్న ఒక విద్యార్థి తెలిపారు.

KTR Interesting Comments on TSPSC : 'డిసెంబరు 3 తర్వాత TSPSC ప్రక్షాళన.. నాదే బాధ్యత'

ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోనూ ప్రధాన పార్టీకి చెందిన ఒక అభ్యర్థి మూడు నెలల్లో రెండు సర్వేలు చేయించారు. మొదటిసారి గెలుపు వరిస్తుందని, రెండోసారి నియోజకవర్గంలో ఓటమి తప్పదంటూ వేర్వేరు నివేదికలు రావటంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో మూడోసారి సర్వే కోసం పొరుగు రాష్ట్రానికి చెందిన మీడియా సంస్థకు బాధ్యత అప్పగించినట్టు సమాచారం. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే.

ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ఎల్బీనగర్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి తదితర నియోజకవర్గాల్లో ఓటరు మనసు గుర్తించేందుకు అభ్యర్థులు సర్వేలకు రూ.లక్షల్లో డబ్బులను వెచ్చిస్తున్నారు. కూకట్‌పల్లిలో రెండు ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు కేవలం ప్రజల అభిప్రాయ సేకరణకే రూ.40లక్షలు వెచ్చించినట్టు సమాచారం.

Telangana Election Campaign in Social Media 2023 : ఎన్నికల ప్రచారంలో సరికొత్త ట్రెండ్.. సోషల్​ మీడియా అడ్మిన్​లతో అభ్యర్థుల అలయ్ బలయ్

Telangana Voter Survey : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజయావకాశాలపై ప్రభావం చూపే యువత, మహిళా ఓటర్ల మనసు తెలుసుకునేందుకు ఆయా పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. వారి అంతరంగం గుర్తించి అనుకూలంగా మలచుకునేందుకు చూస్తున్నారు.యువతకు కావలసిన ఉద్యోగావకాశాలు, మహిళలకు ప్రత్యేకంగా పింఛన్, ఉపాధి హామీ పథకంపై దృష్టి సారిస్తున్నారు. ప్రజల ఆలోచనా విధానానికి తగిన విధంగా రాజకీయ నేతలు పావులు కదుపుతున్నారు. కొన్ని ప్రముఖ సర్వే సంస్థలూ ఆ రెండు వర్గాలపైనే దృష్టి పెడుతున్నాయి.

Telangana Election Code Police Checks 2023 : ఎన్నికల తనిఖీల్లో రూ.377 కోట్ల సొత్తు జప్తు.. నాయకుల డబ్బు నయాపైసా చిక్కలేదట!

తెలంగాణ పోలింగ్ @30 డేస్.. 'అభివృద్ధి' మంత్రంతో బీఆర్ఎస్ .. 'బీసీతంత్రం'తో బీజేపీ .. 'ఆరింటి'పైనే ఆశలతో కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.