Telangana Election Campaign in Social Media : రాష్ట్రంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు అధికార పార్టీ బీఆర్ఎస్ కృషి చేస్తుంటే.. పదేళ్ల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి.
Telangana Leaders Campaign In Social Media : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం హోరందుకుంది. ఒక వైపు అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకలు.. అన్ని నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్తుంటే.. మరో వైపు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచార జోరు పెరిగింది. పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా రాజకీయాలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందకు మెుగ్గు చూపుతున్నారు.
KTR on Trolls: సోషల్‌మీడియా ట్రోల్స్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్..
రోజు రోజు ఎన్నికల ప్రచార సరళి పూర్తిగా మారుపోతుంది. ఒక్కప్పుడు ఎన్నికల అంటే.. భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, పోస్టర్లతో నాయకులు, కార్యకర్తలు హడావిడి చేసేవారు. ఇంటింటా తిరుగుతూ.. తమకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను వేడుకునేవారు. ప్రస్తుతం అలాంటి సంప్రదాయాలు కనుమరుగయ్యాయి. అందరికీ అందుబాటులో ఉండే వాట్సాప్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా.. నేతలు ఎన్నికల ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్తున్నారు.
Telangana Assembly Elections 2023 : దేశంలో, రాష్ట్రంలో అన్ని రాజకీయల పార్టీలకు.. భారీ ఎత్తున సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. దీంతో నాయకులు పెట్టిన ప్రతి పోస్టు ప్రజల్లోకి నేరుగా వెళ్తుంది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇన్‌స్టాగ్రాంలో 80.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా.. ఎక్స్‌లో 92.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. రాహుల్ గాంధీకి ఎక్స్‌లో 24.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా.. ఇన్‌స్టాగ్రాంలో 4.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
రోజురోజుకు సోషల్ మీడియా పెరగడంతో.. రాజకీయ నాయకులు నేరుగా సంబంధిత గ్రూపులు, ఛానళ్ల ద్వారా నేరుగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తున్నారు. ఇందుకోసం ప్రతి పార్టీ ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాన్నే ఏర్పాటు చేసుకుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాటికోసం ప్రత్యేకంగా ఇన్ ఛార్జులను నియమించుకుని వారికి నెలనెలా కొంత మొత్తం చెల్లిస్తూ పార్టీ వివరాలు వారి ద్వారా శ్రేణులకు చేరేలా చూస్తున్నారు.
Prathidwani : రాష్ట్రంలో హీట్ పెంచిన అసెంబ్లీ ఎన్నికలు.. పార్టీల ప్రాధాన్యాలు ఏంటి?