ETV Bharat / state

Telangana Election Campaign 2023 : ప్రచార సందడి షురూ.. ప్రజాక్షేత్రంలోకి ప్రధాన పార్టీలు.. విమర్శలు ప్రతివిమర్శలతో వేడెక్కుతున్న రాజకీయం - కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

Telangana Election Campaign 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ ప్రకటనతో అన్ని రాజకీయపార్టీలు ప్రచారంపై దృష్టిసారించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల నేతలు రంగంలోకి దిగి..నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని అధికార పార్టీ కోరుతుండగా.. కేసీఆర్‌ పాలనా వైఫల్యాలను విపక్ష నేతలు ప్రస్తావిస్తున్నారు.బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నేతలు వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమాగా చెబుతున్నారు.

telangana Political Leaders Election Campaign
Political Leaders Election Campaign in telangana 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2023, 8:43 AM IST

Updated : Oct 12, 2023, 10:54 AM IST

Telangana Election Campaign 2023 : ప్రచార సందడి షురూ.. ప్రజాక్షేత్రంలోకి ప్రధాన పార్టీలు.. విమర్శలు ప్రతివిమర్శలతో వేడెక్కుతున్న రాజకీయం

Telangana Election Campaign 2023 : అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారాతో రాజకీయ పార్టీల్లో సందడి నెలకొంది. ప్రజాక్షేత్రంలో దిగుతున్న నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీలు గుప్పిస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంక శేషయ్య బంజర్‌లో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని.. మరోసారి అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. సత్తుపల్లిలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని సండ్ర కోరారు.

BRS Election Campaign 2023 : కాంగ్రెస్‌ని నమ్ముకుంటే నట్టేట ముంచటం ఖాయమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూనే కాంగ్రెస్ వస్తే జరిగే నష్టాన్ని వివరించే ప్రయత్నం చేశారు. బీజేపీ మతం పేరుతో రెచ్చగొట్టడం తప్ప అభివృద్ధి చేయరని ఆరోపించారు. బండి సంజయ్ రెచ్చగొట్టే మాటలను మానుకోవాలని వినోద్ కుమార్ హితవు పలికారు.

Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. రానున్న 50 రోజులు ఇక సమరమే

Congress Election Campaign 2023 : కాంగ్రెస్‌ని ఆశీర్వదిస్తే ఆరు గ్యారెంటీలతో పేదలకు అండగా నిలబడతామని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. జగిత్యాల 33 వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడకు వెళ్లిన జీవన్‌ రెడ్డి ఆరు గ్యారంటీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, కరపత్రాలు పంపిణీచేశారు. పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్‌ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన భూమాఫియా, ఇసుక మాఫియాకు తోడు కమీషన్ల ప్రజాసొమ్ము దోచుకు‌న్నారని ఆరోపించారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే..సబ్బండ వర్గాలకు మేలు చేసేలా తమ మేనిఫెస్టో ఉంటుందని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

Telangana Congress Manifesto 2023 : గాంధీభవన్‌లో సమావేశమైన మ్యానిఫెస్టో కమిటీ వివిధ వర్గాల నుంచి వినతులు స్వీకరించింది. రాష్ట్ర బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని హామీలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కేసీఆర్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ గౌడ్‌, తెజస అధ్యక్షుడు కోదండరామ్‌ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే వంద రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగులు కల్పిస్తామని మధుయాస్కీ గౌడ్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కోదండరామ్‌ పేర్కొన్నారు.

BJP Election Campaign 2023 : ఆదిలాబాద్ వేదికగా అమిత్ షా బహిరంగ సభ సూపర్‌ హిట్టయుందని..ఐనా బీజేపీ గ్రాఫ్‌ తగ్గిందని కొందరు విషప్రచారం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. అధికార బీఆర్ఎస్​ను సమర్థంగా ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందన్నారు. మోదీ, అమిత్‌షాను విమర్శించే స్థాయి మంత్రి కేటీఆర్​కు లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు రాష్ట్రంలో వీస్తున్నాయని జోస్యం చెప్పిన ఆయన కేంద్రానికి సహకరించకుండా రాష్ట్రాభివృద్దిని అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.

CM KCR Election Tour : సీఎం కేసీఅర్ ఎన్నికల సభల షెడ్యూల్ ఖరారు.. ఈనెల 15 నుంచి నవంబర్ 9 వరకు..

Political Heat in Khammam District : ఖమ్మంలో రాజుకుంటున్న రాజకీయం... ప్రచారాలు ప్రారంభించిన నేతలు

Last Updated : Oct 12, 2023, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.