Telangana Election Campaign 2023 : నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు రాజకీయ పార్టీల నేతలు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. అయితే గతంలో ప్రచార బాధ్యతలను(Election Campaign) ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు అప్పగించేవారు. ఈసారి డివిజన్‌కు ఒక కొత్త బాధ్యుడిని నియమించి.. పనులు మొత్తం వారికే ఇస్తున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల ఎటువంటి ప్రమేయం లేకుండా ప్రచారం మొత్తాన్ని పర్యవేక్షిస్తూ అభ్యర్థితో నేరుగా సమన్వయం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
వీరి పని ఏమిటంటే ప్రజా నాడి పసిగట్టడం, ప్రచార తీరుతెన్నులను పరిశీలిస్తూ అవసరమైతే మార్పులు సూచించడం. ప్రచారానికి అయ్యే ఖర్చు, ఏ మేర ఓటర్లు ప్రభావితం అవుతున్నారో రోజూ నివేదిక సమర్పించడం. అభ్యర్థులతో నేరుగా సమన్వయం చేసుకుంటుండటంతో కార్యకర్తలంతా వారి చుట్టూ తిరుగుతున్నారు. అయితే డివిజన్లలో కీలకంగా ఉండే నేతలు అసంతృప్తిగా ఉన్నారు.
యాప్‌ల వినియోగం : ఓటర్ల జాబితా పరిశీలన.. తమ వైపు మొగ్గే ఓటర్లను గుర్తించి.. వారిని పోలింగ్ బూత్ వరకు రప్పించడం తదితరాలపై ప్రస్తుతం వీరంతా పనిచేస్తున్నారు. కొందరు నాయకులు ప్రత్యేకంగా యాప్‌లు రూపొందించుకుని తమ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా(Voter List) వివరాలను అందులో నిక్షిప్తం చేశారు. రోజూ వంద మంది ఓటర్లతో మాట్లాడటం, వారి మనోగతం గురించి తెలుసుకుంటూ ప్రచారంలో మార్పులు చేయడంపై దృష్టి సారించారు. ఇలా సేకరించిన సమాచారాన్ని అభ్యర్థితో నేరుగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.
ఓటరన్నా ఈసారి నీ ఓటు రేటెంతా - నీ లీడర్ ఇచ్చే చీప్‌లిక్కర్ రేటంతేనా?
Telangana Assembly Elections 2023 : ఓటరు స్లిప్‌ల(Voter Slips) పంపిణీ చేపడుతూ బస్తీల్లో జనాల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. స్థానికంగా కీలక నేతలను ప్రలోభాలకు గురిచేస్తూ.. తమ వైపు తిప్పుకోవడంలోనూ డివిజన్ బాధ్యులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. మహిళా, యువజన, కాలనీ సంఘాలతోనూ వీరే ప్రత్యేకంగా సమావేశమై వారి డిమాండ్లను నాయకుల చెవిలో పడేస్తున్నారు. అనంతరం నేరుగా మాట్లాడించి.. ఓటు కోసం అభ్యర్థిస్తున్నారు. రోజూ సమావేశాలు.. అల్పాహారం, భోజనం, ఇతర సదుపాయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించేదీ కూడా వీరే కావడంతో కార్యకర్తలంతా వారి చుట్టూనే తిరుగుతున్నారు.
కార్యకర్తలు అడిగినవన్నీ ఇస్తూ.. : అంతా తామై.. అన్నింటా తామై నడిపిస్తున్న డివిజన్ బాధ్యులకు కార్యకర్తలు చుక్కలు చూపిస్తున్నారు. అడిగింది ఇవ్వకపోతే తర్వాత రోజు ప్రచారానికి డుమ్మా కొడుతుండటంతో.. ఏది అడిగినా వెంటçనే వారికి సమకూర్చుతున్నారు. ఒక్కో కార్యకర్తకు రోజూ రూ.1000, బిర్యానీ, మద్యం ఇలా ఏది కావాలన్నా అది తెచ్చిపెడుతున్నారు. మరికొన్ని చోట్ల క్యాంప్ ఆఫీసుల్లోనే రోజూ కార్యకర్తలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మాంసాహారం, రాత్రి మందుపార్టీలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత గోవా ట్రిప్ ప్లాన్ చేసి, ముందస్తుగానే టిక్కెట్లు బుక్ చేసి కాలేజీ యువకులను తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు.
'ఎన్నికలు అయిపోయే వరకు మీరే కాస్త సర్దుకోండమ్మా - ప్రచారాలు ముగియగానే మళ్లీ వచ్చి పనిలో చేరిపోతాం'
ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం