ETV Bharat / state

Telangana Double Bedroom Application Status Check Online : ఆన్​లైన్​లో 'డబుల్ బెడ్ రూం' అప్లికేషన్ స్టేటస్.. ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా? - డబుల్ బెడ్ రూం స్కీమ్ తాజా వార్తలు

How to Check Double Bedroom Application Status : మీరు అందరి లాగే తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న 'డబుల్ బెడ్​ రూం స్కీమ్​'కి అప్లై చేశారా? మీకు వస్తుందో లేదో అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఇప్పుడే సింపుల్​గా ఆన్​లైన్​లో మీ డబుల్ బెడ్​ రూం అప్లికేషన్ స్టేటస్ చెక్​ చేసుకొని అర్హుల జాబితాలో మీరు ఉన్నారో లేదో తెలుసుకోండిలా..

Double Bedroom Application Status
Double Bedroom
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2023, 8:01 PM IST

Updated : Sep 7, 2023, 9:33 PM IST

How to Check Double Bedroom Application Online : తెలంగాణ సర్కార్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 2015 అక్టోబరులో రెండు పడక గదుల పథకాన్ని ప్రారంభించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నివాస సదుపాయాలు లేని పేద ప్రజలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి.. వారి సొంతింటి కల సాకారం చేయడమే ఈ పథకం లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డబుల్ బెడ్​ రూం ఇళ్ల పథకం(Double Bedroom Scheme)తో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతోంది.

Telangana 2BHK Application Status in Online : ఎన్నికలు(Telangana Assembly Elections 2023) సమీపిస్తున్న వేళ సర్కార్ డబుల్ బెడ్​ రూం ఇళ్ల పంపిణీని వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించి.. అర్హులైన వారికి పంపిణీ షురూ చేసింది. అయితే ఈ డబుల్ బెడ్​ రూం ఇళ్ల కోసం భారీ మొత్తంలో దరఖాస్తులు పోటెత్తాయి. అయితే మీరు ఈ పథకానికి అప్లై చేసి.. మీకు వస్తుందా? లేదా అని వెయిట్ చేస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ అర్హతలు కలిగి ఉండి మీరు అప్లై చేస్తే.. ఇప్పుడే మీ డబుల్ బెడ్​ రూం అప్లికేషన్ స్టేటస్ చెక్​ చేసుకొని మీకు వచ్చిందో లేదో సింపుల్​గా ఆన్​లైన్​లో ఇలా తెలుసుకోండి..

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందాలంటే ఉండాల్సిన అర్హతలివే..

Double Bedroom Scheme Eligibility Criteria :

  • లబ్ధిదారుడు తప్పనిసరిగా రేషన్ కార్డు/ ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలి.
  • ఈ స్కీమ్​కు అప్లై చేసుకునే వారు ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన వారై ఉండాలి.
  • అలాగే సొంత ఇల్లు లేని, అద్దె ఇంట్లో నివసిస్తున్న కుటుంబాలు ఈ స్కీమ్​కు అర్హులు.
  • ఈ పథకంలో శారీరక వికలాంగులకు 5% రిజర్వేషన్ కేటాయించారు.
  • అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే SC, STలకు 50%.. ఇతరులకు 43%.. మైనారిటీలకు 7% కేటాయించారు.
  • అలాగే పట్టణ ప్రాంతాల్లో నివసించే ఎస్సీలకు 17%, ఎస్టీలకు 6%, మైనార్టీలకు 12%, ఇతరులకు 65% కేటాయించారు.
  • మరో విషయం ఏమిటంటే.. కుటుంబంలోని సభ్యులెవరూ ఇందిరా పథకం వంటి హౌసింగ్ స్కీమ్‌ల కింద ఇల్లు పొంది ఉండకూడదు.

పై అర్హతలు కలిగి ఉండి మీరు తెలంగాణ సర్కార్ అందిస్తున్న డబుల్ బెడ్ రూం పథకానికి అప్లై చేసుకున్నట్లయితే మీరు ఈ పథకం ద్వారా రెండు పడక గదుల ఇల్లు పొందారో లేదో ఇప్పుడే సులువుగా ఆన్​లైన్​లో 'డబుల్ బెడ్ రూం స్కీమ్' అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుని మీరు అర్హుల జాబితాలో ఉన్నారో లేదో తెలుసుకోండిలా..

How to Apply For Double Bedroom Scheme : తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్.. దరఖాస్తు ఎలా చేయాలో తెలుసా?

How to Check Double Bedroom Application Status in Online :

డబుల్ బెడ్‌రూమ్ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..

  • మొదట మీరు తెలంగాణ మీ సేవా పోర్టల్ అధికారిక వెబ్‌సైట్‌ https://ts.meeseva.telangana.gov.in/meeseva/home.htmకి వెళ్లాలి.
  • ఆ తర్వాత హోమ్‌ పేజీని క్రిందికి స్క్రోల్ చేసి 'Know Your Application Status' అనే ఆప్షన్​ పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు ఓపెన్ అయిన పేజీలో మీ Application numberను నమోదు చేయాలి.
  • అనంతరం అక్కడ వచ్చిన క్యాప్చాను ఎంటర్ చేయాలి.
  • అంతే ఆ తర్వాత మీ ఫోన్ లేదా కంప్యూటర్​ స్క్రీన్​ పై డబుల్ బెడ్ ​రూం అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తోంది.

ఇలా సింపుల్​గా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకొని మీకు రెండు పడకల గది వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇంటిలో.. రెండు బెడ్‌ రూమ్​లు, ఒక లివింగ్ రూం, ఇంకా.. ఒక వంటగది, రెండు బాత్‌రూమ్‌లు ఉంటాయి.

Double Bedroom Houses Distribution in Hyderabad : జాతరగా ఇళ్ల పంపిణీ.. కల నెరవేరిన వేళ లబ్ధిదారుల ఆనందం 'డబుల్'

Double Bedroom House Lucky Draw Hyderabad : డబుల్ బెడ్​రూం ఇళ్ల లక్కీ డ్రా ప్రారంభం

Revenue Inspector Cheating On Double Bed Room Houses : డబుల్​ బెడ్​ రూం ఇళ్ల వెరిఫికేషన్​ పేరుతో రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ మోసం...!​

Last Updated : Sep 7, 2023, 9:33 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.