కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రాలకు విడుదల చేసిన హెల్త్ గ్రాంట్(ఆరోగ్య నిధి)లో తెలంగాణ వాటా(health grants 2021) దక్కలేదు. తమ ప్రతిపాదలను పంపకపోవడంతో రాష్ట్రానికి రూ.419 కోట్లు అందలేదు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు శనివారం 19 రాష్ట్రాలకు రూ.8,453.92 కోట్ల గ్రాంట్ విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 28 రాష్ట్రాలకు కలిపి రూ.13,192 కోట్ల గ్రాంట్ సిఫార్సు చేయగా.., ఇప్పటివరకు ప్రతిపాదనలు పంపిన 19 రాష్ట్రాలకు ఆర్థికశాఖ రూ.8,453 కోట్లు ఇచ్చింది. మిగిలిన 9 రాష్ట్రాలు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ద్వారా ప్రతిపాదనలను పంపితే పరిశీలించి వాటికీ విడుదల చేస్తామంది.
దేశంలోని స్థానిక సంస్థలకు 2021-22 నుంచి 2025-26 మధ్య కాలానికి 15వ ఆర్థిక సంఘం రూ.4,27,911 కోట్ల గ్రాంట్(health grants 2021) సిఫార్సు చేసింది. అందులో రూ.70,051 కోట్లు హెల్త్ గ్రాంట్ కింద ఇచ్చింది. ఇందులో రూ.43,928 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలు, రూ.26,123 కోట్లు పట్టణ స్థానిక సంస్థలకు ఇవ్వాలని సూచించింది. స్థానిక సంస్థల పరిధిలోని వైద్య ఆరోగ్యసేవలను బలోపేతం చేయడమే దీని లక్ష్యం.
తెలంగాణకు ఈ అయిదేళ్లలో వచ్చే రూ.2,228 కోట్లను ఈ సౌకర్యాలకు ఉపయోగించుకోవాలి. ప్రతిపాదనలు రాని కారణంగా రాష్ట్రానికి ప్రస్తుతం(2021-22) రూ.419 కోట్లు విడుదల చేయలేదు. ఈ పద్దు కింద 2022-23లో రూ.419 కోట్లు, 2023-24లో రూ.441 కోట్లు, 2024-25లో రూ.463 కోట్లు, 2025-26లో రూ.486 కోట్లు రావాల్సి ఉంది. శనివారం దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ రూ.488.15 కోట్లు, కర్ణాటక రూ.551.53 కోట్లు, తమిళనాడు రూ.805 కోట్లు అందుకోగా.. తెలంగాణ, కేరళ నిధులు పొందలేకపోయాయి.
మరోవైపు రాష్ట్రంలో ఆరోగ్య శాఖకు పెద్దపీట వేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Telangana health minister Harish Rao) శనివారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హరీశ్ రావు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రి(Niloufer Hospital)ని శనివారం సందర్శించారు. ఈ దవాఖానాలో వంద పడకల ఐసీయూ వార్డును(ICU ward inauguration) ఈ సందర్భంగా ప్రారంభించారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం సమర్థంగా పనిచేద్దామని నిలోఫర్ ఆస్పత్రి(Niloufer Hospital) వైద్యులు, సిబ్బందికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Telangana health minister Harish Rao) సూచించారు. కరోనా రెండో దశ తర్వాత పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతమయ్యాయని తెలిపారు. సర్కార్ దవాఖానాల బలోపేతానికి రూ.18 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రూ.10వేల కోట్లు కేటాయించి రాష్ట్ర ఆరోగ్య శాఖ(Telangana health ministry)ను అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి: grmb Chairman tour: రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలను పరిశీలించనున్న జీఆర్ఎంబీ ఛైర్మన్