DGP Suspended, Telangana Election Result 2023 Live : తెలంగాణ ఎన్నికల మొదలు నుంచి హస్తం తన సత్తా చాటుతూ వచ్చింది. బీఆర్ఎస్కు (BRS) అనుకున్నంత ఫలితం రాలేదు. ముందునుంచి దూసుకుపోతున్న కాంగ్రెస్‌కే అధికారం (Congress Won In Telangana Elections)రాబోతుందని కార్యకర్తలు సంబురాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిశారు. దీనిపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో అభ్యర్థులను కలవడాన్ని ఖండించింది. రేవంత్‌ను కలిసి, సెల్యూట్ చేసి పుష్చ గుచ్ఛం ఇవ్వడాన్ని తప్పుగా భావించింది.
ఫలితాలు పూర్తిగా వెల్లడి కాకముందే.. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో నిబంధనలు పాటించలేదని డీజీపీ సస్పెండ్ చేస్తూ మధ్యాహ్నం ఆదేశాలు జారీచేసింది. డీజీపీతో పాటు వెళ్లిన ఇద్దరు అదనపు డీజీలు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్లకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) నోటీసులు జారీ చేసింది. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఇద్దరు అధికారులు ఈసీ స్పష్టం చేసింది.
DGP Anjani KUmar Met Revanth Reddy : అంతకుముందు రేవంత్ రెడ్డి (Revanth Reddy) డీజీపీ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారంపై చర్చించారు. ఈ బాధ్యతలు డీజీపీ అంజనీకుమార్‌కు అప్పగించారు. ఈ తరుణంలోనే ఎలక్షన్ కమిషన్ అంజనీ కుమార్‌ను సస్పెండ్ ఆదేశాలు వెలువడ్డాయి.
Telangana New DGP Ravi Gupta : మరోవైపు కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి రవిగుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన రేపు బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ భద్రతా ఏర్పాట్లు ఆయన పర్యవేక్షణలో సాగనున్నాయి.
మరోవైపు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారంపై దృష్టిసారించింది. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే డీజీపీకి సూచించింది. ఈనెల 9లోగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండవచ్చని రేవంత్ సూచన ప్రాయంగా తెలిపారు. ఓ దశలో రేపు మంచి మూహూర్తం ఉందని.. రేపే ఈ కార్యక్రమం ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ కాంగ్రెస్ వర్గాలు ఈ వార్తలను ధృవీకరించలేదు.
మరోవైపు సీఎల్పీ సమావేశం అనంతరం కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తరువాతే ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సీఎం రేసులో రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. అయితే హైకమాండ్ ఎంపిక చేసిన వారినే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నియమం. దాని ప్రకారం దిల్లీ పెద్దలు సూచించిన వ్యక్తినే ముఖ్యమంత్రి పదవి వరించనుంది. మరోవైపు ఫలితాల అనంతరం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన గులాబీ బాస్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు.