ETV Bharat / state

Telangana Debt 2023 : తెలంగాణ అప్పులు రూ.3.66 లక్షల కోట్లు

Telangana Debt in 2023 till March : రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 2023 మార్చి నాటికి రూ.3లక్షల 66వేల 306 కోట్లకు చేరనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భాగవత్‌ కరాడ్‌ మంగళవారం రాజ్యసభలో తెలిపారు. 2018 మార్చి నాటికి రూ.1.60 లక్షల కోట్ల మేర ఉన్న తెలంగాణ అప్పులు ఆరేళ్లలో 128% పెరిగినట్లు వెల్లడించారు. బడ్జెటేతర మార్గాల్లోనూ తెలంగాణ భారీస్థాయిలో రుణాలు తీసుకున్నట్లు వెల్లడించిన మరో మంత్రి పంకజ్ చౌదరి.. 2021-22లో దేశంలోని 28 రాష్ట్రాలన్నీ కలిపి రూ.66వేల 640.23 కోట్ల బడ్జెటేతర రుణాలు తీసుకోగా అందులో 52.90% వాటా తెలంగాణదే ఉన్నట్లు చెప్పారు.

Telangana Govt Debts
Telangana Govt Debts
author img

By

Published : Feb 8, 2023, 7:55 AM IST

Telangana Debt in 2023 till March : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 2023 మార్చి నాటికి రూ.3లక్షల 66వేల 306 కోట్లకు చేరనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భాగవత్‌ కరాడ్‌ మంగళవారం రాజ్యసభలో తెలిపారు. 2018 మార్చి నాటికి రూ.1.60 లక్షల కోట్ల మేర ఉన్న రాష్ట్ర అప్పులు ఆరేళ్లలో 128% పెరిగినట్లు వెల్లడించారు. బడ్జెటేతర మార్గాల్లోనూ తెలంగాణ భారీస్థాయిలో రుణాలు తీసుకున్నట్లు ఆర్థికశాఖ మరో సహాయమంత్రి పంకజ్‌చౌదరి చెప్పారు.

discussion on Telangana Debt in Rajya Sabha : ఈ రూపంలో తెలంగాణ 2021-22లో రూ.35వేల 257.97 కోట్లు, 2022-23లో రూ.800 కోట్ల రుణం సేకరించి వాటికి సంబంధించిన అసలు, వడ్డీలను బడ్జెట్‌ నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు తెలిపారు. 2021-22లో దేశంలోని 28 రాష్ట్రాలన్నీ కలిపి రూ.66వేల 640.23 కోట్ల బడ్జెటేతర రుణాలు తీసుకోగా అందులో 52.90% వాటా తెలంగాణదే ఉన్నట్లు వెల్లడించారు.

కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ గ్రాంట్లు, సహాయాల కింద 2017-18 నుంచి 2021-22 మధ్య అయిదేళ్లలో తెలంగాణకు రూ.97వేల 11 కోట్లు బదిలీ చేసినట్లు పంకజ్‌ చౌదరి తెలిపారు. ఇందుల్లో పన్ను వాటా బదిలీ కింద రూ.82వేల 378 కోట్లు, ఆర్థికసంఘం నిధుల కింద రూ.11వేల 234 కోట్లు, ప్రత్యేక సాయం రూ.1వేయి 350 కోట్లు, మూలధన వ్యయం కింద 2020-23 మధ్య మూడేళ్ల కాలంలో రూ.2వేల 49 కోట్లు బదిలీ చేసినట్లు వివరించారు.

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి 2022 మార్చి 31 నాటికి రూ.11వేల 935 కోట్ల విద్యుత్తు బకాయిలు రావాల్సి ఉన్నట్లు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కేసింగ్‌ వెల్లడించారు. 2020లో రూ.9వేల 320 కోట్ల మేర ఉన్న ఈ బకాయిలు 2021 నాటికి రూ.10వేల3 కోట్లకు, 2022 నాటికి రూ.11వేల 935 కోట్లకు పెరిగినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.