cs somesh kumar review on aadhar : రాష్ట్రంలో అందరికీ ఆధార్‌కార్డులు జారీ చేయడమే కాకుండా.. వాటిని వ్యక్తిగత మొబైల్ నంబర్లకు అనుసంధానించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. అందరికీ ఆధార్ కార్డుల జారీ, మొబైల్ నంబర్ల అనుసంధానంపై సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఏటా ఆరు లక్షల మంది జన్మిస్తున్నారన్న సోమేశ్ కుమార్... వారందరికీ వెంటనే ఆధార్ కార్డులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఐదేళ్లలోపు చిన్నారులందరికీ ఆధార్ కార్డులు వచ్చేలా మహిళా-శిశుసంక్షేమ, విద్యాశాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఆధార్ సీడింగ్ కేంద్రాలు లేని మండలాలన్నింటిలో వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఐటీశాఖ కార్యదర్శికి సీఎస్ సూచించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, యూడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంగీత, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులను రెండుగా చూపటంపై తెలంగాణ అభ్యంతరం