ETV Bharat / state

విదేశీ మార్కెట్లో పత్తికి కష్టకాలం.. పాతనిల్వ అమ్మకానికి భారీ డిస్కౌంట్లు

అంతర్జాతీయ మార్కెట్​లో పత్తి ధర తగ్గిపోతుండడం.. మరి కొద్ది నెలల్లో కొత్త పంట కోతకు రావడం.. కొవిడ్​ సంక్షోభం.. వీటన్నింటి దృష్టా నిల్వ ఉన్న సరుకును భారత పత్తి సంస్థ అమ్మకానికి పెట్టింది. కరోనా గడ్డుకాలంలో విక్రయిస్తే పలు రాయితీలిస్తామని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో సీసీఐ వద్ద 40 లక్షల బేళ్లు, వ్యాపారుల వద్ద మరో 3 లక్షల బేళ్ల నిల్వలున్నట్లు రాష్ట్ర జిన్నింగ్‌ మిల్లుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.రమేశ్‌ తెలిపారు. వీటన్నింటిని టోకుగా పెద్ద మొత్తంలో కొనే సంస్థలకు భారీగా తాజాగా డిస్కౌంట్లు ప్రకటించింది.

author img

By

Published : Jul 16, 2020, 7:17 AM IST

telangana cotton selling in china ingland contries
విదేశీ మార్కెట్లో ఆ పంట వేలం.. పాతనిల్వకు భారీ డిస్కౌంట్లు

పత్తి పంట ధర అంతర్జాతీయ మార్కెట్‌లో నానాటికీ తగ్గుతోంది. కొవిడ్‌ సంక్షోభంతో పత్తి కొంటే పలురకాల రాయితీలిస్తామని భారత పత్తి సంస్థ’(సీసీఐ) తాజాగా డిస్కౌంట్లు ప్రకటించింది. రెండేళ్లుగా రైతుల నుంచి మద్దతు ధరకు కొన్న కోటి బేళ్ల పత్తి ఈ సంస్థ వద్ద నిల్వ ఉంది. దీనిని అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మేందుకు వేలం ప్రారంభించింది. తెలంగాణలో నిల్వ చేసిన పత్తిని పలు దేశాలకు అమ్ముతోంది. ఆదిలాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ల నుంచి నేరుగా చిట్టగాంగ్‌ (బంగ్లాదేశ్‌), హోచిమన్‌సిటీ (తైవాన్‌), షాంఘై (చైనా), క్వింగ్డావో (చైనా), బందర్‌అబ్బాస్‌ (ఇరాన్‌), తైపీ (తైవాన్‌)లకు పత్తిని విక్రయిస్తోంది. ఆయా దేశాల సంస్థలు ఆన్‌లైన్‌లోనే దూది నాణ్యత, నిల్వల వివరాలు చూసి వేలం ధరలను కోట్‌ చేస్తున్నాయి. ఆరునెలల క్రితం క్యాండీ (355 కిలోల దూది) ధర అంతర్జాతీయ మార్కెట్‌లో వేలానికి రూ.46 వేలు ప్రకటించగా ఇప్పుడు రూ.35 వేల నుంచి రూ.36 వేలకు రోజూవారీగా వేలం వేస్తోంది. ఉదాహరణకు వరంగల్‌ గోదాముల్లో నిల్వలను మంగళవారం క్యాండీ రూ.35,600కు, మహబూబ్‌నగర్‌లోని పత్తిని రూ.35,200కే వేలంలో పెట్టింది. దేశంలోకెల్లా అత్యధికంగా ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌)లో గల నిల్వలో సేంద్రియ విధానంలో పండించిన దూది ధరను గరిష్ఠంగా రూ.37,500కు ఇచ్చింది.

పెరుగుతున్న పత్తి సాగు విస్తీర్ణం

దేశంలో ఈ ఏడాది 3 కోట్ల ఎకరాల్లో పత్తి సాగవుతోందని, ఈ నెల 10నాటికే 2.62 లక్షల ఎకరాల్లో వేశారని కేంద్ర వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి సాగైన 1.94 కోట్ల ఎకరాలతో పోలిస్తే ఈ సీజన్‌లో రికార్డుస్థాయిలో 34.89 శాతం పెరిగిందని స్పష్టం చేసింది. మరో 2 నెలల్లో కొత్త పత్తి పంట మార్కెట్‌కు రావడం మొదలైతే పాతదూది ధర మరింత పడిపోతుందని, అందువల్ల వీలైనంత త్వరగా అమ్మేయాలని సీసీఐ, ప్రైవేటు వ్యాపారులు హైరానా పడుతున్నారు. తెలంగాణలో సీసీఐ వద్ద 40 లక్షల బేళ్లు, వ్యాపారుల వద్ద మరో 3 లక్షల బేళ్ల నిల్వలున్నట్లు రాష్ట్ర జిన్నింగ్‌ మిల్లుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.రమేశ్‌ ‘ఈనాడు’కు చెప్పారు. ప్రస్తుతం పత్తి ధర క్యాండీకి రూ.34 వేలలోపే ఉన్నా సీసీఐ రూ.36 వేలు చెపుతోందని, తగ్గించి అమ్మితే దేశీయ స్పిన్నింగ్‌ మిల్లులకు మేలు జరుగుతుందన్నారు.

పాత నిల్వలు... రాయితీలు...

గతేడాది(2019-20) రైతులు పండించిన పత్తిని సీసీఐ నేరుగా మద్దతు ధరకు కోటి బేళ్ల (బేలు 170 కిలోలు) వరకూ కొన్నది. కానీ అంతకుముందు ఏడాది (2018-19)లో కొన్న 9 లక్షల బేళ్ల పత్తి ఇంకా గోదాముల్లోనే నిల్వ ఉంది. దీనిని గతేడాది దూదికన్నా తక్కువకే విక్రయిస్తోంది. వేలంలో టోకుగా పెద్ద మొత్తంలో కొనే సంస్థలకు పలు రాయితీలను ప్రకటించింది. బకాయిలు సకాలంలో చెల్లించకపోతే వేసే జరిమానాను 15 నుంచి 10 శాతానికి తగ్గించింది. అప్పులపై దూదిని కొంటే వేసే వడ్డీని 13 నుంచి 9 శాతానికి తగ్గిస్తున్నట్లు సీసీఐ తెలిపింది.

ఇవీచూడండి: గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమించిన పొరుగు సేవల సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.