రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 75,289 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,54,758కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,856కు చేరింది. కరోనా బారి నుంచి 482 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,608 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చూడండి: Vaccination: సోమవారం నుంచి జీహెచ్ఎంసీలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్