Telangana Corona Cases: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. గత నెలలో నిత్యం మూడు వేలకుపైగా వచ్చిన కేసులు అంతకంతకూ తగ్గుతున్నట్టు వైద్యారోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 68,720 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,78,910 కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,101 కి చేరింది. మహమ్మారి బారి నుంచి తాజాగా 3,877 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,000 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రికవరీ రేటు 96.39 గా ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 350 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: దేశంలో లక్ష దిగువకు కరోనా కొత్త కేసులు.. పెరిగిన మరణాలు