Telangana Congress MLC Candidates Final List : రాష్ట్రంలో గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ నాలుగు ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థుల ఎంపికపై కొన్ని రోజులుగా కొనసాగిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వ కసరత్తుకు, అధిష్ఠానం ఆమోదంతో తెరపడినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన అభ్యర్థులకు రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయన్న కారణం చూపి ఆమోదముద్ర వేయకుండా గవర్నర్ తిప్పి పంపారు.
దీంతో ఆ రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. ప్రొఫెసర్‌గా విద్యారంగంలో సేవలందించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం (TJS President Kodandaram), విద్యారంగంలో సేవలందిస్తున్న జాఫర్ జావీద్, ప్రముఖ పత్రిక అధినేత అమీర్ అలీఖాన్, ప్రముఖ మస్కతి డైరీ సంస్థ యజమాని మస్కతి, ఏఐసీసీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫయీమ్ ఖురేషి పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రొఫెసర్ కోదండరాం పేరుతో పాటు మరో మైనార్టీ నాయకుడి పేరు ఆమోదం పొందినట్లు సమాచారం.
12 లోక్‌సభ స్థానాలపై కాంగ్రెస్ గురి - ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Telangana Congress Nominated Posts : ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీల్లో ఒకటి బీసీ, మరొకటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇచ్చేందుకు ఆమోదం లభించినట్లు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) , రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపదాస్‌మున్షి, కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై సుదీర్ఘంగా చర్చించారు. కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా సమావేశమైన ఈ ముగ్గురు చర్చించిన పేర్ల జాబితాను ఆయన ముందుంచినట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో లేని పేరును కేసీ వేణుగోపాల్ తెరపైకి తెచ్చినట్లు సమచారం.
Congress MLC Candidates : హైదరాబాద్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రభావంతమైన మైనార్టీ నాయకులు ఉండాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉందని, కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన నాయకులతో పాటు ఎమ్మెల్యే టికెట్ ఆశించి నిరాశకు గురైన నేతలకు ఇచ్చిన హామీ మేరకు నామినేటెడ్ పదవులు భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రతిపక్షాల విమర్శలపై ఎదురుదాడికి సిద్ధమవుతోన్న కాంగ్రెస్ - కార్యాచరణ సిద్ధం!
10 నామినేట్ పదవుల భర్తీకి హైకమాండ్ ఆమోదముద్ర : ఇందుకు సంబంధించి ప్రధానమైన 10 నామినేట్ పదవుల భర్తీకి హైకమాండ్ ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా కింద ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను ఇవాళ లేదా రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. నామినేటెడ్ పదవులకు ఎంపిక చేసిన నాయకుల పేర్లు కూడా బహిర్గతమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
నామినేటెడ్ పదవుల భర్తీకి వేగం పెంచిన కాంగ్రెస్ - ఈ సంక్రాంతికే పూర్తి చేసేలా చర్యలు
కాంగ్రెస్‌కే దక్కనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలు! - భారీగా ఆశావహులు