ETV Bharat / state

16 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల, కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి

Telangana Congress MLA Candidates Third List 2023
Telangana Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2023, 10:33 PM IST

Updated : Nov 7, 2023, 8:05 AM IST

22:27 November 06

మూడో జాబితా ప్రకటించిన కాంగ్రెస్

మూడో జాబితా ప్రకటించిన కాంగ్రెస్

Telangana Congress MLA Candidates Third List 2023 : శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాలుగు నియోజకవర్గాలు మినహా.. అన్నింటికీ అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 55 నియోజకవర్గాలకు.. రెండో జాబితా(Congress Second List)లో 45 నియోజకవర్గాలకు.. మూడో జాబితాలో 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మూడో జాబితా అభ్యర్థులు ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరించింది. ఒకవిధంగా చెప్పాలంటే సుదీర్ఘ కసరత్తు చేసిందని చెప్పవచ్చు. చాలా నియోజకవర్గాలలో గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఉండడం.. రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం.. కొత్తగా పార్టీలో చేరికలు ఉండడం తదితర కారణాలతో మూడో జాబితా విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది.

Revanth Reddy Contest From Kamareddy : కాంగ్రెస్ అధిష్ఠానం కూడా మరింత అప్రమత్తమయ్యి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. రెండో జాబితా 45 మందిని ప్రకటించిన సమయంలో పెద్ద ఎత్తున అసంతృప్త జ్వాలలు చెలరేగాయి. వాటిని సకాలంలో అణచి వేయలేకపోవడంతో.. తీవ్ర అసంతృప్తికి గురైన నాయకులు కొందరు పార్టీని వదిలి పెట్టి బయటికి వెళ్లారు. మరి కొంత మంది పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కొంత స్తబ్ధత నెలకొంది. తాజాగా నిర్వహించిన సర్వే(Telangana Election Survey 2023)లు కూడా కొన్ని సీట్లు కాంగ్రెస్‌కి తగ్గినట్లుగా వెల్లడించాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని.. మూడో జాబితాను మరింత అప్రమత్తంగా కేంద్ర ఎన్నికల కమిటీ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ మూడో జాబితాలోని అభ్యర్థుల వివరాలు :

  • చెన్నూర్‌ (ఎస్సీ)- డా.జి వివేకానంద
  • బోథ్‌ (ఎస్టీ)- వెన్నెల అశోక్‌ స్థానంలో గజేందర్‌
  • జుక్కల్‌ (ఎస్సీ) తోట లక్ష్మీ కాంతారావు
  • బాన్సువాడ - ఏనుగు రవీందర్‌ రెడ్డి
  • కామారెడ్డి -రేవంత్‌ రెడ్డి
  • నిజామాబాద్‌ అర్బన్‌ - షబ్బీర్‌ అలీ
  • కరీంనగర్‌ - పురుమళ్ల శ్రీనివాస్‌
  • సిరిసిల్ల - కోదండం కరుణ మహేందర్‌ రెడ్డి
  • నారాయణఖేడ్‌ - సురేష్‌ కుమార్‌ షెట్కర్‌
  • పటాన్‌చెరు - నీలం మధు ముదిరాజ్‌
  • వనపర్తి - తుడి మేఘా రెడ్డి (జిల్లెల చిన్నారెడ్డి స్థానంలో)
  • డోర్నకల్‌ (ఎస్టీ)- డా. రామచంద్రు నాయక్‌
  • ఇల్లెందు (ఎస్టీ) - కోరం కనకయ్య
  • వైరా (ఎస్టీ) - కరామదాస్‌ మాలోత్‌
  • సత్తుపల్లె (ఎస్సీ)- మట్టా రాగమయి
  • అశ్వారావుపేట (ఎస్టీ) - జారె ఆదినారాయణ

ఆ రెండు స్థానాలకు అభ్యర్థులు మారారు : ఇలా 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా మరో రెండు నియోజకవర్గాలకు మార్పులు, చేర్పులను చేసింది. వనపర్తి మాజీ మంత్రి చిన్నారెడ్డి స్థానంలో మెగారెడ్డిని.. అదేవిధంగా బోథ్ నుంచి ముందు ప్రకటించిన వెన్నెల అశోక్ బదులు ఆదే గజేందర్‌లను పార్టీ ప్రకటించింది. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా భీమ్ భరత్ ను ప్రకటించిన కాంగ్రెస్ తాత్కాలికంగా పక్కన పెట్టింది. దీంతో ఆ స్థానంలో మరొక అభ్యర్థిని ప్రకటిస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఆయనపై వస్తున్న అభియోగాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భరత్‌పై ఉన్న వివిధ కేసులను న్యాయ పరిశీలనకు పంపినట్లు సమాచారం. ఆ నివేదిక వచ్చిన తర్వాతనే హోల్డ్‌లో పెట్టిన అయన.. బీఫామ్‌(Congress B Forms)ను ఇచ్చే అవకాశం ఉంది.

Congress MLA Candidates List : తెలంగాణ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌.. బలమైన అభ్యర్థుల కోసం వేట..

Congress MLA Candidates Third List 2023 : మూడో జాబితాలో ప్రకటించిన 114 నియోజక వర్గాలు కాకుండా.. మరో ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అందులో కొత్తగూడెం సీపీఐకి కేటాయించగా.. సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్, మిర్యాలగూడ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో ఉంచారు. సీపీఎంతో పొత్తు కొనసాగేటట్లు ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇప్పటికే సీపీఎం కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకొని.. 14 నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటించింది. 20కి పైగా నియోజకవర్గాలకు అభ్యర్థులను నియమించి నిలబెట్టాలని ముందుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా సీపీఎంను ఏదో విధంగా దగ్గర చేర్చుకొని.. ముందుకెళ్లాలని భావిస్తోంది. అందుకోసమే మిర్యాలగూడ టికెట్‌ ప్రకటించకుండా ఆపారు.

Telangana Assembly Polls 2023 : ముస్లింలకు సంబంధించిన చార్మినార్ అభ్యర్థి ప్రకటన ఖరారు కాలేదు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు బరిలోకి దించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సూర్యాపేట దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిల మధ్య రాజీ కుదరకపోవడం రాష్ట్ర స్థాయి పార్టీ నాయకుల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆగినట్లుగా తెలుస్తోంది. తుంగతుర్తి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి కాంగ్రెస్‌కు లేకపోవడంతో.. అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. మిర్యాలగూడ సీపీఎంకి ఇవ్వాలని.. పార్టీ యోచిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పొత్తు కుదరనట్లైతే ఆ టికెట్.. బి.లక్ష్మారెడ్డికి దక్కే అవకాశం ఉంది. చార్మినార్ టికెట్ కోసం మైనారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది. ఇవి కాకుండా సీపీఎం పొత్తుకు నిలిస్తే … మిర్యాలగూడ, చార్మినార్ సీట్లను ఇవ్వాలని యోచిస్తున్నారని సమాచారం. మరోవైపు సూర్యా పేట టికెట్ కోసం పటేల్ రమేష్ రెడ్డి .. ఆర్ దామోదర్ రెడ్డి గట్టిగా పట్టుపట్టి ఉన్నారు. ఎవ్వరికి వస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Telangana Congress MLA Candidates Second List : కీలక స్థానాలతో కాంగ్రెస్ రెండో జాబితా.. లిస్టులో గద్దర్ కుమార్తె, అజహరుద్దీన్

Telangana Congress MLA Candidates First List 2023 : తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Last Updated : Nov 7, 2023, 8:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.