ETV Bharat / state

Telangana Congress MLA Candidates Selection Issues : పారదర్శకతకు తిలోదకాలు.. నచ్చిన వారికే టికెట్లు.. ఇదీ కాంగ్రెస్​ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ! - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

Telangana Congress MLA Candidates Selection Issues : అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతకు.. కాంగ్రెస్‌ తిలోదకాలు ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నేతలు పట్టుబట్టి తమవారికే టికెట్లు ఇప్పించుకుంటున్నారన్న విమర్శలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ వడపోత పోసిన నాయకుల జాబితాలో 22 నియోజక వర్గాలకు చెందిన ఆశావహుల పేర్లు ట్యాంపరింగైనట్లు తెలుసుకున్న పీసీసీ ఆ విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ 20 కిపైగా నియోజకవర్గాల్లో ధీటైన అభ్యర్ధులు లేకపోవడంతో బయట నుంచి వచ్చేవారి కోసం వేచి చూస్తోంది.

congress candidates list
congress candidates list
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2023, 8:28 AM IST

Telangana Congress MLA Candidates Selection Issues : సామాజిక, రాజకీయ సమీకరణాలతో పాటు.. అధికార బీఆర్​ఎస్(BRS)​ను దీటుగా ఎదుర్కొనే వారికే టికెట్లు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్‌(Telangana Congress) ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని.. 29 మంది సభ్యుల ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ(PEC) నియోజకవర్గాల వారీగా ప్రాధాన్యత క్రమాన్ని గుర్తిస్తూ టిక్‌ పెట్టింది. ఆ కమిటీ భేటీ ముగియగానే ఆ పుస్తకాలను ఏఐసీసీ కార్యదర్శులు స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు.

అనంతరం అశావహుల జాబితాను స్క్రీనింగ్‌ కమిటీకి ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ నివేదించింది. ఆ జాబితా చూసిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు జరిగినట్లు అనుమానం రావడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సీజ్‌ చేసిన పుస్తకాలు దిల్లీకి తెప్పించినట్లు తెలుస్తోంది. మొత్తం 341 మంది పేర్లను స్క్రీనింగ్‌ కమిటీకి నివేదించగా అందులో నాలుగు చోట్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోనట్లు ఖాళీగా ఉంచారు.

Congress Candidates Selection Allegations : ఖానాపూర్‌, రాజేంద్రనగర్‌లో.. ఎవరూ పోటీపడట్లేదని పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రేవంత్‌రెడ్డి .. సీజ్‌ చేసిన పుస్తకాల నుంచి తిరిగి జాబితా సిద్ధం చేయించినట్లు తెలుస్తోంది. ఐతే ముందు తయారు చేసిన జాబితాలో 22 నియోజకవర్గాలకు చెందిన ఆశావహులను తారుమారు చేసినట్లు వెల్లడైంది. 4 నియోజకవర్గాల్లో ఆశావహులు లేరని ఖాళీగా చూపించగా.. మరో 4 చోట్ల అనుకూలమైన వారి ప్రాధాన్యత మార్చారు. మరో 14 చోట్ల అనుకూలమైన వారిని మొదటి మూడు పేర్లల్లో ఉండేట్లు చేర్చారని సమాచారం. ఆ విషయం గోప్యంగా ఉంచిన పీఈసీ.. అసలు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Congress Ticket War in Palamuru : ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ టికెట్​ దక్కించుకునేదెవరు..?

Telangana Congress MLA candidates List Ready : స్క్రీనింగ్‌ కమిటీ వడపోతపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్‌లో సర్వేల ఆధారంగా తిరుపతిరెడ్డికి టికెట్ ఇవ్వాల్సి ఉండగా.. కొత్తగా పార్టీలో చేరనున్న మైనంపల్లి రోహిత్‌ కోసం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఖానాపూర్‌లో చారులత రాథోడ్‌, భరత్‌చౌహాన్‌ పని చేస్తుండగా.. వారిని కాదని బీఆర్​ఎస్​ నుంచి వస్తున్న ప్రజా ప్రతినిధికి ఇచ్చేందుకు పక్కన పెట్టినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌ టికెట్‌ను మాజీ డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్‌ ఆశిస్తున్నారు. కానీ అక్కడ బీజేపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డికి ఇచ్చేందుకు మొగ్గు చూపుతుండడంతో స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడు బాబా సిద్దిఖీ మాత్రం కొత్వాల్‌కే ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

Telangana Congress Screening Committee Meeting in Delhi : 119 నియోజకవర్గాలకు 300 పేర్లను సిద్ధం చేసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ

Telangana Assembly Polls 2023 : ఇప్పటికీ 20కిపైగా నియోజకవర్గాల్లో దీటైన అభ్యర్థులు లేరన్న చర్చ పార్టీలో నడుస్తోంది. దరఖాస్తులు అన్ని నియోజకవర్గాల్లో వచ్చినా.. ఆ దరఖాస్తుదారుల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ సమీకరణాలకు తగినట్లు శక్తి సామర్థ్యాలు సరిపోవని తేల్చినట్లు సమాచారం. అక్కడ ఇతర పార్టీల నుంచి వచ్చేవారి కోసం వేచి చూస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నవారికి కాకుండా బయట నుంచి వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారని కొందరు అడుగుతున్నారు. సర్వేల ఆధారంగా ఎంపిక ఉంటుందని చెబుతూ వచ్చిన ఏఐసీసీ, పీసీసీ కొత్తవారికి వేటిని ప్రామాణికంగా తీసుకొని టికెట్లు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

Revanth Reddy on Congress Candidates Announcement : 'త్వరలోనే తొలి విడతలో సగానికిపైగా సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తాం'

Telangana Congress Screening Committee Meeting in Delhi : 70కి పైగా స్థానాల్లో స్పష్టత.. త్వరలోనే అధిష్ఠానానికి తొలి జాబితా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.