Telangana Congress MLA Candidates List Delay : రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పటి వరకు ఆడుగులో అడుగు వేసుకుంటూ.. నత్తనడక నడుస్తోంది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని విధాల వేగం పెంచేందుకు సమాయత్తం అవుతోంది. గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్.. ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. మొదటి జాబితా (Congress MLA Candidates First List) అయినా ఈ వారంలో వస్తుందని అంచనా వేసిన ఆశావహులకు నిరాశనే మిగిలింది. ఆలస్యమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
Telangana Congress MLA Tickets Issue : ఇప్పటి వరకు వందకు పైగా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. వామపక్షాలు ఎటూ తేలకపోవడం, మరికొందరు పార్టీలో చేరేవారుండడంతో.. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం మరికొంత ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్(Telangana Election Schedule) విడుదల కావడంతో.. అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైతే ఎన్నికల్లో అన్నిరకాల నష్టపోయే ప్రమాదం ఉందని ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Telangana Congress MLA Candidates Selection Process : ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేసి ఎలాంటి వివాదంలేని నియోజకవర్గాలకైనా అభ్యర్థులను ప్రకటన చేయాలన్న యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయిలో చర్చకు వచ్చిన ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో స్పష్టత రావాల్సి ఉంది. అందరికి ఒకేసారి ప్రకటిస్తారా.. లేక వివాదంలేని ఏకాభిప్రాయానికి వచ్చిన 60కి పైగా నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించేందుకు చొరవ చూపుతారా.. అనేది కాంగ్రెస్ అత్యున్నత కమిటీ సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత వెల్లడవుతుందని భావిస్తున్నారు.
Congress MLA Candidates List Telangana 2023 : అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ(Congress MLA Candidates Selection)ను అలా పక్కన పెడితే.. తిరగబడదాం-తరిమికొడదాం అనే నినాదంతో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బస్సు యాత్ర(Bus Yatra) ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించిన పీసీసీ.. రేపటి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో విధివిధానాలపై చర్చ జరుగుతుందని వెల్లడిస్తోంది. ప్రధానంగా బస్సు యాత్ర ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కొనసాగాలి.. ఏయే పార్లమెంటు నియోజకవర్గాలు ద్వారా బస్సు యాత్ర సాగితే ఎక్కువ నియోజకవర్గాలు తక్కువ సమయంలో కవర్ అవుతాయన్న దానిపై చర్చ జరగనుంది.
Congress Bus Yatra Schedule 2023 : ఎక్కడెక్కడ కార్నర్ సమావేశాలు ఏర్పాటు చేయాలి.. ఆ సమావేశాలల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేయనుందో వివరిస్తారు. ఇప్పటి వరకు ప్రకటించిన మూడు డిక్లరేషన్లు, చేయూత పెన్షన్, ఆరు గ్యారంటీలపై ప్రచారం చేయాలని భావిస్తోంది. అదేవిధంగా బీసీ డిక్లరేషన్, మహిళ డిక్లరేషన్ కూడా త్వరగా ప్రకటించి.. వాటిని కూడా జనంలోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. మరొకవైపు మేనిఫెస్టోపై శ్రీధర్ బాబు కమిటీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆ కమిటీ ఇప్పటికే అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంది. సబ్బండ వర్గాల ప్రజలను ఆకట్టుకునేట్లు మేనిఫెస్టో సిద్ధం చేసేందుకు కసరత్తు ముమ్మరమైంది.
Telangana Congress Manifesto 2023 : వీలైనంత త్వరగా మేనిఫెస్టోను అందుబాటులోకి తీసుకురావాలని పీసీసీ భావిస్తోంది. ఈ నెల 15వ తేదీన బస్సు యాత్రను ప్రియాంక గాంధీ(Priyanka Gandhi ) ప్రారంభించి.. ఆమె రెండ్రోజుల పాటు బస్సు యాత్రలో పాల్గొంటారు. ఆ తర్వాత ఈ నెల 18, 19 తేదీల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) బస్సుయాత్రలో పాల్గొంటారు. ఈ సందర్భంగా మేనిఫెస్టో కూడా ఆయన చేతుల మీదుగా విడుదల చేయించాలని పీసీసీ భావిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్రకు రంగం సిద్ధం : అదేవిధంగా ఈ నెల 20, 21 తేదీల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బస్సు యాత్రలో పాల్గొంటారు. బస్సు యాత్ర వారం.. పది రోజులు ఉంటుందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ వర్గాలు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఎన్ని రోజులు అన్నదానిపై స్పష్టత రానుంది. పది రోజులు నిర్వహించతలపెడితే మరో రెండ్రోజుల పాటు.. కర్ణాటక నుంచి బీసీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు కూడా బస్సుయాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Congress MLA Candidates List : తెలంగాణ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్.. బలమైన అభ్యర్థుల కోసం వేట..
Telangana Congress Bus Yatra Schedule 2023 : ఈనెల 15 నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర