ETV Bharat / state

Telangana Congress MLA Candidates List : అభ్యర్థుల వడపోత కార్యక్రమం షురూ.. కాంగ్రెస్​ లిస్ట్​ ఎప్పుడంటే..? - కాంగ్రెస్​ స్క్రీనింగ్ కమిటీ

Telangana Congress MLA Candidates List : శాసనసభ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్‌ ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తుల వడపోత పూర్తవటంతో.. ఇవాళ్టి నుంచి స్క్రీనింగ్ కమిటీ కార్యాకలాపాలు మొదలవనున్నాయి. సోమ, మంగళవారాల్లో పీఈసీ, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్లతో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలు సేకరించనుంది. బుధవారం సమావేశం కానున్న స్క్రీనింగ్ కమిటీ.. పీఈసీ వడపోసి అందించిన జాబితాపై కసరత్తు చేస్తుంది. ఈ నెలాఖరులోగా కాంగ్రెస్.. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

Congress Leaders Latest Meeting
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2023, 9:02 AM IST

Telangana Congress MLA Candidates List అభ్యర్థుల వడపోత కార్యక్రమం షురూ.. కాంగ్రెస్​ లిస్ట్​ ఎప్పుడంటే..

Telangana Congress MLA Candidates List : రాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టికెట్ల కోసం మొదలైన కసరత్తులో మొదటి ఘట్టం పూర్తైంది. 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో నుంచి వచ్చిన 1006 దరఖాస్తుల వడపోత ప్రక్రియ ముగిసింది. రెండోసారి పీఈసీ ఛైర్మన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆశావహుల వివరాలను సభ్యులకు పీసీసీ అందించింది. 500 పైగా పేజీలతో కూడిన బుక్‌లెట్‌లో దరఖాస్తుదారుల పూర్తి వివరాలు పొందుపరిచారు.

Telangana Congress Screening Committee : ఇందులో ఒకటి, రెండు నుంచి భారీ సంఖ్యలో 36 వరకు అర్జీలు వచ్చిన నియోజకవర్గాల సమాచారం ఉంది. ఆశావహులకు పార్టీతో ఉన్న అనుబంధం, బలోపేతానికి చేసిన కృషి, స్థానిక రాజకీయ, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని అర్హులైన అభ్యర్థులను పీఈసీ సభ్యులు ఎంపిక చేశారు. ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గానికి ముగ్గురు పేర్లను సిఫార్సు చేసి బుక్‌లెట్‌లు బయటికు రాకుండా కవర్లలో సీజ్‌ చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా, మధుయాస్కీ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పొంగులేటి దగ్గరుండి పర్యవేక్షించారు.

Telangana Congress MLA List 2023 : ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ తర్వాత స్క్రీనింగ్‌ కమిటీ(Congress Screening Committee) వడపోత కార్యక్రమం మొదలు కానుంది. ఇందుకోసం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌, జిగ్నేశ్‌ మేవాని, బాబా సిద్ధిఖీ, ఇద్దరు సభ్యులు హైదరాబాద్‌ రానున్నారు. ఇప్పటికే గాంధీభవన్‌లో మకాం వేసిన 29 మంది పీఈసీ సభ్యులతో 10నుంచి 15 నిమిషాల పాటు విడివిడిగా చర్చించనున్నారు. ఉదాహరణకు మహిళా అభ్యర్థుల ఎంపికపై రాష్ట్రంలోని పరిస్థితులను మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీత రావు స్క్రీనింగ్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏవైనా విజ్ఞప్తులు ఉంటే సీల్డు కవరులో ఇవ్వాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బీసీ అభ్యర్థులకు పెద్దపీట వేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ వివరించారు.

Congress PEC Meeting Postponed : సెప్టెంబర్​ 2న జరగాల్సిన కాంగ్రెస్ PEC సమావేశం వాయిదా

"అశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులపై మరో మూడు రోజులు రాష్ట్ర స్క్రీనింగ్​ కమిటీ కార్యాచరణ చేసి కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర స్క్రీనింగ్​ కమిటీ.. అభ్యర్ధులను షార్ట్​ లిస్ట్​ చేస్తోంది. సెంట్రల్​ కమిటీ ఆమోదం పొందాకే.. అభ్యర్థులను ప్రకటిస్తాం. ఈలోపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం లేదు." - రేవంత్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

Revanth Reddy on MLA List : స్క్రీనింగ్‌ కమిటీ మూడు రోజులపాటు హైదరాబాద్‌లో ఉండనుంది. మొదటి రోజు పీఈసీ సభ్యులతో, రెండో రోజు డీసీసీలు, సీనియర్‌ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. మూడో రోజు పీఈసీ అందించిన అభ్యర్ధుల జాబితాను నిశితంగా పరిశీలించి వడపోయనుంది. ఆ జాబితాను కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనుంది. సీఈసీ పరిశీలన అనంతరం నియోజకవర్గానికి ఒకటే పేరు సిఫార్సు వచ్చిన వారితో ఈనెల 15 తొలి జాబితా.. మిగతా వారి పేర్లతో నెలాఖరున మలి జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి.

Revanth Reddy on Congress Declarations : 'చేతి గుర్తు మా చిహ్నం.. చేసి చూపించడమే మా నైజం.. కర్ణాటకలో చేశాం.. తెలంగాణలోనూ చేస్తాం'

Congress MLA Candidates Selections Controversy : కాంగ్రెస్​లో 'డబుల్'​ ట్రబుల్​.. తెరపైకి కొత్త తరహా వివాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.